వరుస ఫ్లాప్స్‌.. రవితేజ షాకింగ్ డెసిషన్!

Published on Mon, 11/10/2025 - 19:36

మాస్ మహారాజా ఇటీవల సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదు. ధమాకా హిట్‌ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత మాస్‌ ఇమేజ్‌ ఉన్నప్పటికీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. ఇటీవలే రిలీజైన మాస్ జాతర రిజల్ట్‌ కూడా ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరించింది. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజ అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. దీంతో రవితేజకు మాస్‌ ట్యాగ్‌ అంతగా కలిసి రావడం లేదని సగటు సినీ ప్రియులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మాస్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్న వేళ.. రవితేజ ఫ్యాన్స్‌కు సరికొత్త సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ కొత్త సినిమాను సడన్‌గా ప్రకటించారు. ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మాస్ హీరోకు పెద్దగా కలిసి రాకపోయినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేస్తున్నాడు మన స్టార్ హీరో. అయితే ఈ సారి కొత్త మూవీ టైటిల్ చూస్తే మాస్‌ ట్రాక్‌ మార్చినట్లు అర్థమవుతోంది. ఈ మూవీని ఫ్యామిలీ అండ్‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. వరుస ఫ్లాఫ్‌లు ఎదురవుతున్న తరుణంలో చేస్తోన్న ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటిస్తున్నాడని సమాచారం. నిర్మాతలపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే సినిమా సక్సెస్ తర్వాత పర్సంటేజ్ రూపంలో తీసుకుంటాడని మరో టాక్‌ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా నిర్మాతలు నష్టపోకుండా ఉండాలన్న రవితేజ నిర్ణయం మంచిదేనని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. 
 

Videos

నువ్వే పెద్ద కల్తీ.. సుప్రీం తిట్టినా బుద్ధి మారదా!

Watch Live: జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్

ఏపీ ఇక సూడాన్.. 17 నెలల్లో బాబు చేసిన అప్పు

షుగర్ పేషెంట్స్ కు రియల్ గుడ్ న్యూస్

తెలంగాణలో మరో బస్సు ప్రమాదం

ఉగ్రవాదుల అరెస్ట్.. మరుసటి రోజే బాంబు బ్లాస్ట్..

ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ హై అలర్ట్

బాంబు బ్లాస్ట్ పై అమిత్ షా ఫస్ట్ రియాక్షన్

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Photos

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్‌ వద్ద భారీ పేలుడు (చిత్రాలు)

+5

తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)