Breaking News

మరణాన్ని ముందే ఊహించిన హీరో..

Published on Mon, 11/10/2025 - 13:05

తమిళ హీరో అభినయ్‌ కింగర్‌ (44) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం (నవంబర్‌ 10న) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తన మరణాన్ని ఆయన ముందుగానే అంచనా వేశారు. కేవలం ఏడాది లేదా ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని డాక్టర్స్‌ చెప్పారంటూ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడారు. అందులో అతడు బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ వీడియో బయటకు వచ్చిన మూడు నెలలకే అభినయ్‌ మరణించడం విషాదకరం!

ఎవరీ అభినయ్‌?
ప్రముఖ మలయాళ నటి టి.పి.రాధామణి కుమారుడే అభినయ్‌ కింగర్‌ (Abhinay Kinger). తుళ్లువదో ఇళమై అనే తమిళ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమ్యారు. తమిళ చిత్రం 'జంక్షన్‌'తో హీరోగా మారారు. కానీ తర్వాత హీరోగా కంటిన్యూ కాలేకపోయారు. సక్సెస్‌, పొన్‌ మేఘలై, ఆరుముగం, సింగారా చెన్నై, ఆరోహణం వంటి పలు కోలీవుడ్‌ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో కేవలం మూడే మూడు మూవీస్‌ చేశారు. చివరగా 2014లో వచ్చిన వల్లవణుక్కు పుళ్లం ఆయుధం సినిమాలో బిజినెస్‌మెన్‌గా కనిపించారు. అంతేకాకుండా మిలింద్‌ సోమన్‌, బాబు ఆంటోని, విద్యుత్‌ జమ్వాల్‌ వంటి నటులకు డబ్బింగ్‌ చెప్పారు.

 

 

చదవండి: 'పర్ఫామెన్స్‌ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్‌లో ఎవరంటే?

Videos

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Sailajanath: చంద్రబాబు మీ కళ్ళు తెరిపించేందుకే ఈ సంతకాల సేకరణ

Cotton Farmers: నల్లగొండ- దేవరకొండ రహదారిపై ఎడ్లబండ్లతో నిరసన

అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ వివాదం

టికెట్ ఇప్పిస్తానని వేమన సతీష్ రూ.7 కోట్లు తీసుకున్నారు: సుధా మాధవి

Ambati: దేవుడితో రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటే

శ్రీ చైతన్య స్కూల్ లో మరో బాలిక ఆత్మహత్య...

కేంద్ర బలగాలు, 5000 మంది పోలీసులు ప్రత్యేక డ్రోన్లతో నిఘా..

Photos

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)

+5

ఘనంగా ప్రారంభమైన ‘ఇరువురు భామల కౌగిలిలో’ చిత్రం (ఫొటోలు)

+5

కార్తీక సోమవారం శోభ.. ఉదయాన్నే ఆలయాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

ఏఆర్ రెహమాన్ కన్సర్ట్‌లో 'పెద్ది' టీమ్ సందడి (ఫొటోలు)