Breaking News

నా సినిమాల విజయంలో అందెశ్రీ..: నారాయణ మూర్తి

Published on Mon, 11/10/2025 - 11:34

ప్రముఖ రచయిత అందెశ్రీ (Ande Sri) ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయన్ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. అందెశ్రీ మరణంపై దర్శకనటుడు, పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తి (R Narayana Murthy) స్పందించారు.

తీరని లోటు
ప్రజాకవి అందెశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు, యావత్ ప్రపంచ తెలుగు జాతికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ.. నా సినిమాలైన ఊరు మనదిరా, ఎర్ర సముద్రం, వేగు చుక్కలకు అమోఘమైన పాటలు ఇచ్చి చిత్ర విజయాలకు అందెశ్రీ ఎంతో దోహదం చేశారు. ఎర్ర సముద్రంలో మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు అనే పాట తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ముద్రించబడింది. అది ఆ పాట గొప్పతనం..

జన్మ ధన్యం
ఊరు మనదిరా మూవీలోని చూడా చక్కని తల్లి.. చుక్కల్లో జాబిల్లి అనే పాట తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించడమే కాదు నాటికి, నేటికి, ఏ నాటికైనా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా అనే పాట కూడా అంతే బాగుంటుంది. అన్నింటినీ మించి జయ జయహే తెలంగాణ.. పాటతో ఆయన జన్మ ధన్యం చేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి, గౌరవించి తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఇలాంటి గొప్ప పాటలు అందించిన ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి అని ప్రార్థిస్తున్నాను అని నారాయణమూర్తి పేర్కొన్నారు.

చదవండి: ముక్కోటి గొంతుకల్ని ఏకం చేసిన అందెశ్రీ.. పాటతోనే ప్రాణం

Videos

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Sailajanath: చంద్రబాబు మీ కళ్ళు తెరిపించేందుకే ఈ సంతకాల సేకరణ

Cotton Farmers: నల్లగొండ- దేవరకొండ రహదారిపై ఎడ్లబండ్లతో నిరసన

అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ వివాదం

టికెట్ ఇప్పిస్తానని వేమన సతీష్ రూ.7 కోట్లు తీసుకున్నారు: సుధా మాధవి

Ambati: దేవుడితో రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటే

శ్రీ చైతన్య స్కూల్ లో మరో బాలిక ఆత్మహత్య...

కేంద్ర బలగాలు, 5000 మంది పోలీసులు ప్రత్యేక డ్రోన్లతో నిఘా..

Photos

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)

+5

ఘనంగా ప్రారంభమైన ‘ఇరువురు భామల కౌగిలిలో’ చిత్రం (ఫొటోలు)

+5

కార్తీక సోమవారం శోభ.. ఉదయాన్నే ఆలయాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

ఏఆర్ రెహమాన్ కన్సర్ట్‌లో 'పెద్ది' టీమ్ సందడి (ఫొటోలు)