Breaking News

మస్క్‌లాంటి వారు మాత్రమే సంపన్నులవుతారు!

Published on Thu, 11/06/2025 - 13:58

కృత్రిమ మేధ(AI) వేగంగా అభివృద్ధి చెందడం మొదలైనప్పటి నుంచి ఉద్యోగాల కోత సంచలనంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వాటి కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగిస్తూ వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ గాడ్ ఫాదర్‌గా పిలువబడే జెఫ్రీ హింటన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐలో వస్తున్న మార్పు భవిష్యత్తులో కోట్లాది మందిని నిరుద్యోగులుగా మారుస్తుందని, ఈలోగా కేవలం ఎలాన్ మస్క్ వంటి కొద్దిమంది మాత్రమే ధనవంతులు అవుతారని జోస్యం చెప్పారు.

కంపెనీల వైఖరి

ఇప్పటికే టెక్‌ దిగ్గజాలైన ఐబీఎం, టీసీఎస్‌, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు ఏఐని అమలు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఈ ధోరణి ఇప్పట్లో ఆగిపోయే అవకాశం లేదని హింటన్ బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోకుండా ఏఐతో ముందుకు వెళ్లే మార్గం ఉందా అని అడిగినప్పుడు ‘అది సాధ్యం కాదని నమ్ముతున్నాను. డబ్బు సంపాదించాలంటే మానవ శ్రమను భర్తీ చేయాలి. అందుకు ఏఐను వాడుతున్నారు. కంపెనీలు లాభాలు పెంచుకునేందుకు ఈ పంథాను వినియోగిస్తున్నాయి’ అన్నారు.

ఏఐ సమస్య కాదు.. సామాజిక సమస్య..

ఏఐ అభివృద్ధి వల్ల ఏర్పడే ఆర్థిక అసమానతపై జెఫ్రీ హింటన్ మాట్లాడుతూ.. ‘టెక్ బిలియనీర్లు మాత్రమే ఈ రేసులో విజేతలుగా నిలుస్తారు. గణనీయ సంఖ్యలో ఉద్యోగుల స్థానంగా ఏఐ పని చేస్తుంది. మస్క్ వంటి వ్యక్తులు మాత్రమే ధనవంతులు అవుతారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు. ఇది ఏఐ సమస్య కాదు, సామాజిక సమస్య. ఏఐ మన సమాజాన్ని, మన ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మిస్తుందనేది నిశితంగా గమనించాలి’ అన్నారు.

ఇదీ చదవండి: ఏఐ బూమ్ ఎఫెక్ట్: ఫ్లాష్‌ మెమరీ కాంపోనెంట్ల కొరత

Videos

Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు

విద్యుత్ ఉద్యోగిపై TDP నేత రంగారెడ్డి బూతులు

Tirupati: అంధకారంలో గ్రామాలు వరదలో కొట్టుకుపోయిన పశువులు

జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే

KSR Live Show: క్రెడిట్ దొంగ

చంద్రబాబు గుండెల్లో బుల్లెట్ ట్రైన్లు కరకట్టపై యాంకర్ ఈశ్వర్ సంచలన నిజాలు

బీహార్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్... ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్

KGH: విద్యుత్ సరఫరా నిలిచిపోయి పనిచేయని వైద్య పరికరాలు

భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలప డానికి సిద్ధం

రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని లక్షల మంది చనిపోతున్నారా?

Photos

+5

చీరలో చందమామే.. అందరి చూపులు తనపైనే! (ఫోటోలు)

+5

'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్‌ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

కాంత ట్రైలర్‌ లాంచ్‌.. ఒకే వేదికపై దుల్కర్‌, రానా (ఫోటోలు)

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)