Breaking News

దెయ్యాలకే దడ పుట్టించిన రీతూ.. గేమ్‌ గెలిచింది మాత్రం!

Published on Wed, 11/05/2025 - 17:08

బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) హౌస్‌ కొన్నిసార్లు దెయ్యాలకొంపలానూ మారిపోతుంటుంది. ఏమాటకామాట.. దెయ్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది సోహైల్‌! భయమనేది మా ఇంటావంటా లేదన్నట్లుగా బిల్డప్‌ ఇచ్చి చీకటి గదిలోకి వెళ్లాడు. తీరా అక్కడ చిన్న వెలుతురు లేకపోగా వింత శబ్ధాలు, ఫ్లాష్‌ లైట్లలో దెయ్యం ఆకారాలు చూసి మామూలుగా జడుసుకోలేదు. ఇప్పుడదే టాస్క్‌ తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లోనూ రిపీట్‌ అవుతోంది.

ఆడపులి..
ఈ మేరకు ప్రోమో కూడా వదిలారు. తనూజ భయంభయంగానే ఆ గదిలోకి వెళ్లి తనకిచ్చిన టాస్క్‌ పూర్తి చేసింది. తర్వాత రీతూ వంతు వచ్చింది. లోపల జాగ్రత్త.. అని సంజనా ధైర్యం చెప్తుంటే.. ఆడపులి ఇక్కడ అని బిల్డప్‌ ఇచ్చింది. తీరా లోపలకు వెళ్లాక ఆ దెయ్యం కాళ్లు పట్టుకోవడమే తక్కువ అన్నట్లుగా మారింది. ఇలా చేస్తే నేను బయటకు పోతా.. అన్న ప్లీజ్‌.. ప్లీజ్‌.. అంటూ వేడుకుంటూనే ఉంది. చివర్లో మాత్రం దెయ్యంలా ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వుకు దెయ్యాలే జడుసుకుని పారిపోవడం ఖాయం! ఈ గేమ్‌లో తనూజ గెలిచినట్లు తెలుస్తోంది. ఇక సుమన్‌, దివ్య ఎవరికీ అనుమానం రాకుండా సీక్రెట్‌ టాస్కులు పూర్తి చేస్తున్నారు. మరి చివరకు ఎవరు కెప్టెన్సీ కంటెండర్లవుతారో చూడాలి!

 

చదవండి: బండ్ల గణేశ్‌ సెటైర్లు.. కౌంటరిచ్చిన అల్లు అరవింద్‌

Videos

బాబుకు హైకోర్టు బిగ్ షాక్.. జోగి రమేష్ దెబ్బ అదుర్స్..!

మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు

తెలుగు మూవీలో కుంభమేళా పూసల పిల్ల

రన్నింగ్ బస్సులో మంటలు.. RTC బస్సు దగ్ధం..!

ACB రైడ్స్.. బయటపడ్డ కూటమి అవినీతి బాగోతాలు

దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్

YSRCP మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు

అజారుద్దీన్ పై కాంగ్రెస్ మహిళ నేత షాకింగ్ కామెంట్స్..

పవన్ నీ సొల్లు కబుర్లు ఆపు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన జడ శ్రవణ్

రాసిపెట్టుకో ఈశ్వర్.. రేవంత్ కథ అక్కడే ముగుస్తుంది

Photos

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)

+5

తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్‌ (ఫోటోలు)

+5

వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)

+5

జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్‌ ఎమోషనల్‌ (ఫోటోలు)