సస్పెన్స్‌కు తెర.. రూ.300 కోట్ల సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఫిక్స్!

Published on Tue, 10/14/2025 - 21:00

కల్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలో వచ్చిన చిత్రం 'లోకా'. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద  రూ.300 కోట్లు వసూళ్లు సాధించినట్లు ఇటీవలే పోస్టర్‌ పంచుకున్నారు మేకర్స్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్‌ నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఆగస్టు 28న రిలీజైంది. ఆ తర్వాత తెలుగులో ఒక రోజు ఆలస్యంగా విడుదలైంది. టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద కూడా ఫర్వాలేదనిపించింది.

అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. ఈ మూవీ రిలీజై 50 రోజులు కావొస్తోంది. పెద్ద పెద్ద సినిమాలే కేవలం నాలుగైదు వారాల్లోనే స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. అలాంటిది ఈ సినిమా ఇంకా ఓటీటీకి రాలేదు. ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలోనే ఓటీటీకి రానుందని వార్తలొచ్చినా అలాంటిదేం జరగలేదు. రూమర్స్ రావడంతో దుల్కర్ సైతం ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు.

తాజాగా కొత్త లోక స్ట్రీమింగ్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను రివీల్ చేశారు. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ తేదీని రివీల్ చేస్తామని పోస్టర్‌ పంచుకున్నారు. దీంతో కొత్త లోక మూవీ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్‌లో సస్పెన్స్‌కు తెరపడింది. 

(ఇది చదవండి: హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ)

కొత్త లోక కథేంటంటే..

'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ ఉన్న ఓ అమ్మాయి. ఈమె గురించి కొందరికి తెలుసు.  ఓ సందర్భంలో చంద్ర, బెంగళూరు రావాల్సి వస్తుంది. తన పవర్స్ బయటపెట్టకుండా సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. రాత్రిపూట ఓ కేఫ్‌లో పనిచేస్తుంటుంది. ఎదురింట్లో ఉంటే సన్నీ(నస్లేన్).. ఈమెని చూసి లవ్‌లో పడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల దెబ్బకు చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర గతమేంటి? ఎస్ఐ నాచియప్ప(శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
 

 

Videos

జోగి రమేషే ఎందుకు? అనలిస్ట్ పాషా సంచలన నిజాలు

బెడిసికొట్టిన ప్లాన్.. అడ్డంగా దొరికిన తర్వాత రూట్ మార్చిన టీడీపీ పెద్దలు

TDPకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు

సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం

బాబు, పోలీసులపై కోర్టు సీరియస్

Big Question: బెడిసి కొట్టిన పిట్టకథ..

పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మద్యం దుకాణాలు నడుపుతున్నారు: వైఎస్ జగన్

టీడీపీ జనార్దన్ రావు వీడియోపై కేతిరెడ్డి సంచలన నిజాలు..

పవన్ ప్రశ్నలు బాబు కవరింగ్

నీ వల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగం లేదు బాబుని ఏకిపారేసిన రాచమల్లు..

Photos

+5

‘తెలుసు కదా’ సినిమా ప్రెస్‌ మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ శారీ లుక్‌లో ‘కూలి​’ బ్యూటీ..

+5

సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో 'కాంతార' బ్యూటీ (ఫొటోలు)

+5

కాంతార ‘కనకావతి’ శారీ లుక్‌ అదరహో! (ఫొటోలు)

+5

'థామ' ప్రమోషన్స్‌లో రష్మిక, మలైకా అరోరా స్టెప్పులు (ఫోటోలు)

+5

చాలారోజుల తర్వాత 'విష్ణు ప్రియ' గ్లామ్‌ షూట్‌ (ఫోటోలు)

+5

‘మిత్రమండలి’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)