'కాంతార'కు అక్కడ భారీ నష్టాలే.. కారణం ఇదే

Published on Tue, 10/14/2025 - 13:45

కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ఈ చిత్రం కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. సోమవారం కూడా సుమారు రూ. 20 కోట్లకు పైగానే రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.675 కోట్ల గ్రాస్‌  మార్క్‌ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో బాహుబలి-1  ఫైనల్‌ కలెక్షన్స్‌ మార్క్‌ను కాంతార దాటేసింది. 

అయితే, కాంతారా చాప్టర్ 1 అమెరికాలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ గణనీయమైన నష్టాలను చవిచూసే ఛాన్స్‌ ఉంది. ఇప్పటివరకు, ఈ చిత్రం దాదాపు రూ. 4 మిలియన్ల డాలర్స్‌ (రూ. 36 కోట్లు) వసూలు చేసింది.  అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా తాజాగా మేకర్స్‌ షేర్‌  చేశారు. ఈ కలెక్షన్స్‌ నంబర్‌ పర్వాలేదనిపించినప్పటికీ బ్రేక్-ఈవెన్ మార్కుకు చాలా  దూరంలో ఉంది. ఈ సినిమాను చాలా ఎక్కువ ధరకు అమెరికాలో కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చేయడానికి దాదాపు రూ. 8 మిలియన్ల డాలర్స్‌  అవసరం అవుతుంది. ఆ మార్క్‌ను కాంతార అందుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీంతో అమెరికాలో కాంతార నష్టాలు మిగల్చడం తప్పదని సమాచారం.

అయితే, తెలుగు, కన్నడ, తమిళ్‌, హిందీ బెల్ట్‌లో మాత్రం భారీ లాభాల దిశగా కాంతార దూసుకుపోతుంది.  దీపావళి సందర్భంగా ఈ వారంలో మరో నాలుగు ప్రధాన సినిమాలు విడుదల కానున్నడంతో కాంతారా చాప్టర్ 1 కలెక్షన్స్‌ ప్రపంచవ్యాప్తంగా మరింత తగ్గే ఛాన్స్‌ ఉంది. ఏదేమైనా మరో మూడు రోజులు మాత్రమే కాంతార సందడి కనిపించనుంది.  ఈ ఏడాదిలో ఛావా సినిమా రూ. 800 కోట్ల కలెక్షన్స్‌తో టాప్‌ వన్‌లో ఉంది. ఇప్పుడు కాంతార కూడా ఆ మార్క్‌ను అందుకోవాలని చూస్తుంది. 2022లో విడుదలైన కాంతార చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 నిర్మించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. 
 

Videos

జోగి రమేషే ఎందుకు? అనలిస్ట్ పాషా సంచలన నిజాలు

బెడిసికొట్టిన ప్లాన్.. అడ్డంగా దొరికిన తర్వాత రూట్ మార్చిన టీడీపీ పెద్దలు

TDPకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు

సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం

బాబు, పోలీసులపై కోర్టు సీరియస్

Big Question: బెడిసి కొట్టిన పిట్టకథ..

పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మద్యం దుకాణాలు నడుపుతున్నారు: వైఎస్ జగన్

టీడీపీ జనార్దన్ రావు వీడియోపై కేతిరెడ్డి సంచలన నిజాలు..

పవన్ ప్రశ్నలు బాబు కవరింగ్

నీ వల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగం లేదు బాబుని ఏకిపారేసిన రాచమల్లు..

Photos

+5

‘తెలుసు కదా’ సినిమా ప్రెస్‌ మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ శారీ లుక్‌లో ‘కూలి​’ బ్యూటీ..

+5

సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో 'కాంతార' బ్యూటీ (ఫొటోలు)

+5

కాంతార ‘కనకావతి’ శారీ లుక్‌ అదరహో! (ఫొటోలు)

+5

'థామ' ప్రమోషన్స్‌లో రష్మిక, మలైకా అరోరా స్టెప్పులు (ఫోటోలు)

+5

చాలారోజుల తర్వాత 'విష్ణు ప్రియ' గ్లామ్‌ షూట్‌ (ఫోటోలు)

+5

‘మిత్రమండలి’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)