ముఖంపై అవాంచిత రోమాలు.. అదే కారణమన్న తెలుగు నటి

Published on Thu, 09/18/2025 - 19:13

మగరాయుడి గెటప్‌తోనే పాపులర్‌ అయింది తెలుగింటి అమ్మాయి స్నిగ్ధ (Actress Snigdha Nayani). 'అలా మొదలైంది' సినిమాతో తన కెరీర్‌ మొదలైంది. మేం వయసుకు వచ్చాం, దమ్ము, ప్రేమ ఇష్క్‌ కాదల్‌, చందమామ కథలు, టైగర్‌, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ ఇలా అనేక సినిమాలు చేసింది. ప్రస్తుతం స్నిగ్ధ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.. కానీ సింగర్‌గా పలు షోలు చేస్తోంది. ఈ నటి రీల్‌ లైఫ్‌లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లో కూడా మగరాయుడిలాగే ఉంటుంది. 

ఆ కారణం వల్లే ముఖంపై..
పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండిపోతానని చెప్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నిగ్ధకు ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. ముఖంపై గడ్డాలు, మీసాలు రావడానికి గల కారణమేంటని యాంకర్‌ అడిగాడు. అందుకు స్నిగ్ధ స్పందిస్తూ.. షూటింగ్స్‌కు వెళ్తున్న సమయంలోనే పీసీఓడీ వచ్చింది. దీని వల్ల అవాంచిత రోమాలు వస్తుంటాయి. అలాగే చాలామంది అమ్మాయిలకు ఫేషియల్‌ హెయిర్‌ ఉంటుంది. 

గుండు గీయించుకున్నా..
నెలకోసారి థ్రెడింగ్‌ చేసుకుంటారు. ఇది చాలా మామూలు విషయం. అయితే నేను షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు నా ముఖంపై హెయిర్‌ కనిపిస్తుందనగానే వెంటనే మేకప్‌మ్యాన్‌ లేజర్‌తో గీకేసేవారు. దానివల్ల అదింకా ఎక్కువైంది. మరో విషయమేంటంటే.. ఎంబీఏ అయిపోగానే నేను గుండు చేయించుకున్నాను. అప్పుడతడు నా తలపై నుంచి ముఖం మీది దవడ వరకు బ్లేడుతో గీకాడు. అప్పటినుంచే అవాంచిత రోమాలు రావడం చిన్నగా మొదలైంది. మా అమ్మక్కూడా ఫేషియల్‌ హెయిర్‌ ఉంది అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది.

చదవండి: సల్మాన్‌ ఒక గూండా, నీచుడు.. ఆ దర్శకుడిని చితకబాదిన స్టార్‌ హీరో

Videos

17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

మహేష్ తో ప్రభాస్ డైరెక్టర్.. స్క్రీన్స్ బ్లాస్ట్ పక్కా

మీలాంటి దుష్ట శక్తులనుండి ప్రజలను కాపాడాలని ఆ అప్పన్న స్వామిని వేడుకుంటున్నా

గుర్తుపెట్టుకో.. మేమే నిన్ను గెలిపించాం.. మేమే వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తాం

అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కాయి.. అనితను రఫ్ఫాడించిన నాగ మల్లీశ్వరి

పోలీసులా? టీడీపీ కార్యకర్తలా? విద్యార్థులను ఈడ్చుకెళ్ళిన పోలీసులు

బిల్డప్ మాధవి.. కడప ఎమ్మెల్యే ఓవరాక్షన్

బాబూ.. నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశావా..

కారును ఈడ్చుకెళ్లిన టిప్పర్.. ఏడుగురిని చంపిన టీడీపీ నేత అత్యాశ

Photos

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?