Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్ మర్డర్
Breaking News
థియేటర్లలో దక్ష, బ్యూటీ.. మరి ఓటీటీలో ఏయే సినిమాలో తెలుసా?
Published on Thu, 09/18/2025 - 18:00
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ థియేటర్ల రిలీజ్ కావడం లేదు. మంచు లక్ష్మీ లీడ్ రోల్లో వస్తోన్న దక్ష, అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర నటించిన లవ్ స్టోరీ ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటితో పాటు విజయ్ ఆంటోని భద్రకాళి, కన్నడ సినిమా వీర చంద్రహాస కూడా థియేటర్లలో రిలీజవుతున్నాయి.
ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం కొత్త సినిమాలు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. కాజోల్ వెబ్ సిరీస్ ద ట్రయల్ సీజన్- 2, వాటిలో శ్రీలీల, కిరిటీ నటించిన జూనియర్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అయితే జూనియర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు. రేపటి నుంచి సడన్ స్ట్రీమింగ్కు వస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, హాలీవుడ్ చిత్రాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
నెట్‌ఫ్లిక్స్
సీ సెయిడ్ మేబీ- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 19
హంటెడ్ హోటల్-(యానిమేషన్ హారర్ సిరీస్)- సెప్టెంబర్ 19
బిలియనీర్స్ బంకర్- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 19
28 ఇయర్స్ లేటర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 20
అమెజాన్ ప్రైమ్
జూనియర్ (కన్నడ డబ్బింగ్ సినిమా)- సెప్టెంబర్ 19(రూమర్ డేట్)
కాన్పిడెన్స్ క్వీన్ సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- సెప్టెంబర్ 20
జియో హాట్‌స్టార్
పోలీస్ పోలీస్ (తమిళ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 19
ద ట్రయల్ సీజన్ -2 (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 19
స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19
సన్ నెక్స్ట్
ఇంద్ర (తమిళ సినిమా) - సెప్టెంబరు 19
మాటొండ హెలువే (కన్నడ మూవీ) - సెప్టెంబరు 19
ఆహా
ష్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 19
జూనియర్- (కన్నడ సినిమా)- సెప్టెంబరు 19(రూమర్ డేట్)
జీ5
హౌస్‌మేట్స్ (తమిళ సినిమా) - సెప్టెంబరు 19
లయన్స్ గేట్ ప్లే
ద సర్ఫర్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19
మనోరమ మ్యాక్స్
రండం.. యామం(మలయాళ మూవీ)- సెప్టెంబరు 19
Tags : 1