Breaking News

'ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తా.. నా కోసం ఆ ఒక్క పని చేసి పెట్టమని చెప్పా'

Published on Wed, 09/17/2025 - 16:39

అధ్యక్షా.. అనే ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్అయిన కమెడియన్‌ సుమన్‌ శెట్టి (Suman Shetty). నితిన్హీరోగా వచ్చిన జయం మూవీతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. తర్వాత తెలుగులో పలు సినిమాల్లో తన కామెడీ టైమింగ్తో మెప్పించాడు. అప్పట్లో సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుమన్.. ఈ మధ్యకాలంలో సైలెంట్‌ అయిపోయాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించని సుమన్ శెట్టి.. బిగ్బాస్ రియాలిటీ షోతో మళ్లీ కెరీర్ రీ స్టార్ట్ చేశాడు.

తాజాగా సుమన్ శెట్టి గురించి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తేజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతన్ని పరిచయం చేశాక.. సినిమాల్లో నీకు మంచి అవకాశాలు వస్తాయి.. తొందరగా నువ్వు ఒక సైట్కొనుక్కో అని సుమన్కు సలహా ఇచ్చానని అన్నారు. అన్నట్లుగానే సుమన్ శెట్టి సైట్కొని ఇల్లు కూడా కట్టుకున్నాడని తెలిపారు. ఒకసారి నా వద్దకు వచ్చిన సుమన్.. ఇదంతా మీవల్లే సార్అంటూ నా కాళ్లను టచ్చేస్తా అన్నారు. నేను ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడని గుర్తు చేసుకున్నారు.

తేజ మాట్లాడుతూ.. 'కాళ్లను టచ్చేయడం నా కిష్టం లేదని చెప్పా. నేను విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడు. నేను కొత్త వాళ్లతో సినిమాలు తీస్తా ఉంటా. ఇలా చేస్తూ నేను ఏదో ఒక రోజు రోడ్డుమీదకి వచ్చేస్తా. అప్పుడు నేను ఉండేందుకు నువ్వు కట్టుకునే ఇంటిలో ఒక రూమ్ ఉంచు అని చెప్పా. నేను అన్నట్లుగానే అతని ఇంటిలో నాకోసం రూమ్కట్టి.. ఆ గదిలో నా ఫోటో పెట్టి రోజు క్లీన్ చేస్తూ ఉంటాడు' అని తెలిపారు.

కాగా.. తేజ డైరెక్షన్లో వచ్చిన జయం, జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం లాంటి సినిమాల్లో సుమన్ శెట్టికి అవకాశాలిచ్చాడు. అందువల్లే తేజ సార్ నాకు గాడ్‌ ఫాదర్ అని సుమన్ శెట్టి చాలాసార్లు చెప్పారు. కాగా.. కమెడియన్ సుమన్ శెట్టి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, భోజ్‌పురి భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించారు.

Videos

అనంతపురం సభలో సిగ్గు లేకుండా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు

Bhumana Abhinay: చంద్రబాబు పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై విశ్వేశ్వర్ రెడ్డి కౌంటర్..

ప్రతి పేదవాడికి కావాల్సిందే విద్య, వైద్యం.. వాటినే చంద్రబాబు గంగలో కలిపేశారు

వావిలాల గోపాలకృష్ణయ్యకి అంబటి నివాళి

Warangal: యూరియా కోసం రైతుల అవస్థలు

మధ్యప్రదేశ్‌లోని ధార్ లో ప్రధాని మోదీ పర్యటన

Komatireddy: కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు

విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

Photos

+5

లండన్‌ వేకేషన్‌లో హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

తొలిసారి ఒంటరిగా.. యాంకర్ అనసూయ పోస్ట్ (ఫొటోలు)

+5

సిద్దార్థ్-అదితీ పెళ్లిరోజు సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘మిరాయ్‌’ మూవీ సక్సెస్ మీట్‌లో మెరిసిన శ్రియా శరణ్ (ఫొటోలు)

+5

నవరాత్రులకు సిద్దమైన అమ్మవారి విగ్రహాలు రండి చూసేద్దాం (ఫొటోలు)

+5

విజయవాడలో ‘మిరాయ్‌’ మూవీ విజయోత్సవం (ఫొటోలు)

+5

నేడు ప్రధాని మోదీ పుట్టినరోజు.. ఈ ఫొటోలు చూశారా..

+5

‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

హీరో ధనుష్‌ 'ఇడ్లీ కొట్టు' ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా బ్రిగిడ సాగా (ఫొటోలు)