Breaking News

తిరుమలలో టాలీవుడ్ హీరోయిన్.. గుర్తుపట్టారా?

Published on Wed, 09/17/2025 - 15:16

ఈమె తెలుగులో పలు సినిమాలు చేసిన హీరోయిన్. దాదాపు 20 ఏళ్ల పాటు స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. మీడియాకు కూడా కనిపించలేదు. కొన్నాళ్ల క్రితం తిరుమలలో కనిపించారు. మళ్లీ ఇప్పుడు మరోసారి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: లోకేశ్ కనగరాజ్‌ని పక్కనబెట్టేశారా? నెక్స్ట్ 'ఖైదీ 2')

పైన ఫొటోలో కనిపిస్తున్నది రవళి. తెలుగులో సూపర్ హిట్ సినిమా 'పెళ్లి సందడి' హీరోయిన్. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ క్రమంలోనే ఈమె వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. స్వతహాగా తెలుగమ్మాయి అయిన ఈమె.. 18 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చింది. తొలుత మలయాళంలో 'జడ్జిమెంట్' అనే మూవీతో నటిగా మారింది. తర్వాత సంవత్సరం 'జయభేరి' సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో పెద్దగా అవకాశాలు రాలేదు. 'పెళ్లి సందడి' ఈమెకు ఓవర్ నైట్ స్టార్‌డమ్ తీసుకొచ్చింది.

రవళి చేసిన వాటిలో ఒరేయ్ రిక్షా, వినోదం, చిన్నబ్బాయి, ముద్దుల మొగుడు, శుభాకాంక్షలు తదితర తెలుగు సినిమాలున్నాయి. తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాల్లో నటించింది. చివరగా 2011లో 'మాయగాడు'లో నటించింది. వ్యక్తిగత విషయానికొస్తే 2007లో నీలికృష్ణ అనే అతడిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. ఈమె సోదరు హరిత కూడా నటినే. ఈమె ప్రస్తుతం తెలుగు సీరియల్స్ చేస్తోంది.

(ఇదీ చదవండి: 'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్)

Videos

అనంతపురం సభలో సిగ్గు లేకుండా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు

Bhumana Abhinay: చంద్రబాబు పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై విశ్వేశ్వర్ రెడ్డి కౌంటర్..

ప్రతి పేదవాడికి కావాల్సిందే విద్య, వైద్యం.. వాటినే చంద్రబాబు గంగలో కలిపేశారు

వావిలాల గోపాలకృష్ణయ్యకి అంబటి నివాళి

Warangal: యూరియా కోసం రైతుల అవస్థలు

మధ్యప్రదేశ్‌లోని ధార్ లో ప్రధాని మోదీ పర్యటన

Komatireddy: కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు

విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

Photos

+5

లండన్‌ వేకేషన్‌లో హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

తొలిసారి ఒంటరిగా.. యాంకర్ అనసూయ పోస్ట్ (ఫొటోలు)

+5

సిద్దార్థ్-అదితీ పెళ్లిరోజు సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘మిరాయ్‌’ మూవీ సక్సెస్ మీట్‌లో మెరిసిన శ్రియా శరణ్ (ఫొటోలు)

+5

నవరాత్రులకు సిద్దమైన అమ్మవారి విగ్రహాలు రండి చూసేద్దాం (ఫొటోలు)

+5

విజయవాడలో ‘మిరాయ్‌’ మూవీ విజయోత్సవం (ఫొటోలు)

+5

నేడు ప్రధాని మోదీ పుట్టినరోజు.. ఈ ఫొటోలు చూశారా..

+5

‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

హీరో ధనుష్‌ 'ఇడ్లీ కొట్టు' ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా బ్రిగిడ సాగా (ఫొటోలు)