Breaking News

'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్

Published on Wed, 09/17/2025 - 13:33

గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్' సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల కలెక్షన్ కూడా సాధించింది. ఈ మేరకు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే మూవీ సక్సెస్‌ని మంగళవారం రాత్రి విజయవాడలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి 'మిరాయ్' టీమ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో మాట్లాడిన నిర్మాత.. హీరో, దర్శకుడికి కార్లు గిఫ్ట్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

(ఇదీ చదవండి: మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?)

సాధారణంగా సినిమాలు హిట్ అయి, మంచి కలెక్షన్స్ సాధిస్తే నిర్మాతలు.. దర్శకుడికో హీరోలకో ఖరీదైన లగ్జరీ కార్లని బహుమతిగా ఇస్తుంటారు. ఇప్పుడు కూడా 'మిరాయ్' హిట్ కావడంతో నిర్మాత విశ్వప్రసాద్ ఆనందపడుతున్నారు. ఈ క్రమంలోనే హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనికి.. వాళ్లకు నచ్చిన కార్లని గిఫ్ట్‌గా ఇస్తానని స్టేజీపైనే ప్రకటించారు.

'మిరాయ్' విషయానికొస్తే.. 'హనుమాన్' తర్వాత తేజ చేసిన మరో సూపర్ హీరో సినిమా ఇది. తేజ హీరో కాగా మంచు మనోజ్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. స్వతహాగా సినిమాటోగ్రఫర్ అయిన కార్తిక్ ఘట్టమనేని.. ఈ చిత్రంతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ రితికా నాయక్, ప్రత్యేక పాత్ర చేసిన శ్రియ కూడా ఈ మూవీతో గుర్తింపు సాధించారు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో గౌర హరి ఆకట్టుకోవడం విశేషం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)

Videos

KSR Live Show: ప్రభుత్వ మెడికల్ కాలేజీల చరిత్రలో చీకటి రోజు

మారని పాక్ బుద్ధి.. బాల్ తో అంపైర్ పై దాడి

ఉడతతో స్నేహం

సాక్షి రిపోర్టర్ పై పోలీసుల దౌర్జన్యం

మెడికల్ కాలేజీలు పేదల కోసం.. బినామీలకు ఇస్తానంటే ఊరుకోము

Watch Live: ఛలో మెడికల్ కాలేజ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతా.. బైరెడ్డి మాస్ వార్నింగ్

17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

మహేష్ తో ప్రభాస్ డైరెక్టర్.. స్క్రీన్స్ బ్లాస్ట్ పక్కా

Photos

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)