Breaking News

వాటే పబ్లిక్‌ టాయిలెట్‌.. టూరిస్ట్‌ స్పాటా..?!

Published on Fri, 09/12/2025 - 12:15

టూరిస్ట్‌ స్పాట్‌ అనగానే ఏ అద్భుతమైన ప్రకృతి దృశ్యమో లేక మిస్టరీ ప్రదేశాలో అనుకుంటాం. కానీ ఇలాంటి టూరిస్ట్‌ స్పాట్‌ ఒకటి ఉందని అస్సలు ఊహించరు. ఆ ప్రదేశం పేరు వినగానే ఇదేం పర్యాటక ప్రదేశం రా బాబు అని తలపట్టుకుంటారు. కానీ చూస్తే మాత్రం..దీన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న వారి అద్భుత ఆలోచనను ప్రశంసించకుండా ఉండలేరు. ఇంతకీ అదేంటో చక చక​ చదివేయండి మరి..

చైనాలోని గన్సు ప్రావిన్స్‌లోని డన్హువాంగ్‌ నైట్‌ మార్కెట్‌లో కొత్తగా పునరుద్ధరించిన పబ్లిక్‌ టాయిలెట్‌ ఊహించని విధంగా సాంస్కృతిక ఆకర్షణగా మారింది. ఓ సాధారణ రెస్ట్‌రూమ్‌కి ఇంత క్రేజ్‌ ఏంటా అనే కదా..!. అయితే ఇది అలాంటి ఇలాంటి రెస్ట్‌రూమ్‌ కాదు. "డన్హువాంగ్ ప్యూర్ రియల్మ్ పబ్లిక్ కల్చరల్ స్పేస్"గా పిలిచే ఈ టాయిలెట్‌ యునెస్కోలో చోటు దక్కించుకున్న‌ ప్రసిద్ధ మొగావో గుహలకు నిలయంగా కళాత్మకంగా తీర్చిదిద్దారు. చారిత్రాత్మక కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఉంటుంది ఈ రెస్ట్‌రూమ్‌. 

చెప్పాలంటే వారసత్వ కళకు ప్రతిబింబంలా ఉంటుంది ఈ పబ్లిక్‌  టాయిలెట్‌ రూపురేఖలు. రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ డన్హువాంగ్‌ పబ్లిక్‌ టాయిలెట్‌ సంస్కృతికి అర్థం పట్టేలా కుడ్య చిత్రాలు, ఏదో రాజదర్బారులో ఉన్న అనుభూతిని ఇస్తాయి. బయటి భాగంలో అల్ట్రా క్లియర్‌ గాజు కర్టెన్‌ గోడలు ఉన్నాయి. అంతేకాదండోయ్‌ ఈ రెస్ట్‌రూమ్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌ నర్సింగ్‌ టేబుల్స్‌, చైల్డ్‌ సేఫ్టీ సీట్లు, స్వీయ క్లీనింగ్‌ సిస్టమ్‌తో కూడిన పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ గది కూడా ఉంది. 

అలాగే ఇక్కడ సౌకర్యవంతమైన సీటింగ్‌ ప్రదేశం తోపాటు డ్రింక్‌ డిస్పెన్సర్‌లు, వృద్ధులు, వికలాంగులకు అనువైన సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆగస్టు 16న ప్రారంభించిన ఈ పబ్లిక్‌ టాయిలెట్‌ అతి కొద్ది సమయంలోనే పర్యాటకులకు ఇష్టపమైన స్పాట్‌గా మారిపోయింది. దీన్ని సందర్శించడానికి పర్యాటకులు సాంప్రదాయ హన్పు దుస్తులను కూడా ధరిస్తారట. అందుకు సంబంధించిన వీడీయో నెట్టింట సంచలనం సృష్టించడమే గాదు, రకరకాల చర్చలకు దారితీసింది కూడా.

 

(చదవండి: ఫిఫ్టీ ప్లస్‌.. టాలెంట్‌ జోష్‌..! యాభై దాటాకా లైఫ్‌ స్టార్ట్‌ అంటున్న 'ఖ్యాల్‌')


 

 

 

Videos

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్

Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది

'మిరాయ్’ మూవీ రివ్యూ

చంద్రబాబుకి ఆ రెండంటే గుర్తొచ్చేది వ్యాపారమే

Haryana: కానిస్టేబుల్ ను గంట జైల్లో పెట్టిన కోర్టు

Garam Garam Varthalu: ‪120 ఏళ్లు.. హ్యాపీ బర్త్‌ డే బామ్మ

Photos

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)

+5

మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)