బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది'
Published on Sat, 08/02/2025 - 12:38
బుల్లితెర నటి అంజలి పవన్ (Anjali Pavan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో నటి శోకసంద్రంలో మునిగిపోయింది. అమ్మ చనిపోయిన విషయాన్ని అంజలి.. సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అమ్మా, నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది. నువ్వు ఇచ్చిన ప్రేమ, నీ చిరునవ్వు, నీ మాటలు.. ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలలోనే మిగిలిపోయాయి. కాలం నిన్ను మా నుంచి దూరం చేసినా.. మా హృదయం నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు.

నమ్మలేకపోతున్నాం..
నీ ఆశీస్సుల వెలుగు ఎల్లప్పుడూ మా జీవితాలకు దారి చూపిస్తుంది. అమ్మ ఆత్మకు శాంతి కలగాలి అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన ఇతర నటీనటులు.. అయ్యో, నమ్మలేకపోతున్నాం.. ఓం శాంతి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ మీ అమ్మగారు మీ కడుపున పుడతారు, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ అభిమానులు నటిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
రెండో ప్రెగ్నెన్సీ..
మొగలిరేకులు సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న అంజలి ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోంది. 2017లో నటుడు సంతోష్ పవన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి చందమామ అనే కూతురు ఉంది. ఇటీవలే రెండోసారి గర్భం దాల్చగా.. జూన్‌లో అంజలికి ఘనంగా సీమంతం కూడా చేశారు. త్వరలోనే మరో బుజ్జాయి ఇంట్లో అడుగుపెట్టనుందని సంతోషిస్తుండగా.. అంతలోనే అమ్మ మరణించడంతో నటి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అంజలి.. రాధా కల్యాణం, దేవత వంటి సీరియల్స్‌తో పాటు లెజెండ్, ఒక లైలా చిత్రాల్లో నటించింది.
చదవండి: జాతీయ అవార్డ్స్.. వాళ్ల కష్టానికి ఫలితం అంటూ షారుక్ ఖాన్
Tags : 1