బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
చాహల్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహ్‌వశ్.. వామ్మో క్రికెట్ టీమ్‌నే కొనేశారా?
Published on Fri, 08/01/2025 - 21:26
ప్రముఖ ఆర్జే మహ్వశ్ పేరు కొన్ని నెలలుగా తెగ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ టీమిండియా క్రికెటర్ చాహల్తో సన్నిహితంగా కనిపించడమే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మహ్వశ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ పంజాబ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది. దీంతో చాహల్తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతున్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. ఇటీవల వీరిద్దరు లండన్లో జంటగా కనిపించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటివరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రికెట్ మ్యాచ్లు వీక్షించడమే కాదు.. ఏకంగా క్రికెట్ టీమ్నే సొంతం చేసుకుంది. ఇవాళ జరిగిన సీఎల్టీ10 లీగ్లో ఆక్షన్లో తళుక్కున మెరిసిన మహ్వశ్..ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ను కొనుగోలు చేసింది. తన టీమ్కు కెప్టెన్‌గా షాన్ మార్ష్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆర్జే మహ్వశ్ టీమ్ కెప్టెన్..షాన్ మార్ష్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో చాహల్ను కూడా మీ టీమ్లోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
Tags : 1