Weather: ఏపీకి భారీ వర్ష సూచన
Breaking News
నా సినిమాకు రూ.600 కోట్ల కలెక్షన్స్, అందుకే రెట్టింపు రెమ్యునరేషన్!
Published on Wed, 07/16/2025 - 12:53
స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందే బాక్సాఫీస్ వద్ద యుద్ధం మొదలు కానుంది. ఆగస్టు 14న రజనీకాంత్ 'కూలీ' (Coolie Movie), హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల 'వార్ 2'చిత్రాలు రిలీజ్ కానున్నాయి. దీంతో బాక్సాఫీస్ వార్‌లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలని సినీప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కూలీ విషయానికి వస్తే ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు రూ.350 కోట్లతో కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.
ఆయన పారితోషికం గురించి చెప్పలేను
హీరో రజనీకాంత్ రూ.150 కోట్లు, దర్శకుడు లోకేశ్ రూ.50 కోట్లు రెమ్యునరేషన్ (Lokesh Kanagaraj Salary) తీసుకున్నట్లు ఫిల్మీదునియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ.. రజనీకాంత్ సర్ పారితోషికం గురించి నేనేం చెప్పలేను. అయితే మీరు అంటున్నట్లుగా నేను రూ.50 కోట్లు తీసుకుంటున్నాను. నా గత సినిమా లియోకు తీసుకున్నదానికంటే ఇది రెట్టింపు రెమ్యునరేషన్.
అందుకే డబుల్ తీసుకుంటున్నా..
లియో సినిమా రూ.600 కోట్లకు పైగానే వసూలు చేసింది. కాబట్టి నేను గత సినిమాకంటే డబుల్ పారితోషికం తీసుకుంటున్నాను. ఇది నా రెండేళ్ల జీవితం. అన్నింటినీ త్యాగం చేసి రెండేళ్లుగా కూలీకే అంకితమయ్యాను, అది నా బాధ్యత కూడా అని పేర్కొన్నాడు. కూలీ మూవీ విషయానికి వస్తే.. రజనీకాంత్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సౌంబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబా మోనికా జాన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవించదర్ సంగీతం అందించాడు.
చదవండి: ‘బాహుబలి’ రీరిలీజ్: రన్‌టైమ్‌పై పుకార్లు.. రానా ఏమన్నారంటే..?
Tags : 1