Breaking News

లార్డ్స్‌లో లవ్ బర్డ్స్.. బాయ్‌ఫ్రెండ్‌తో ఆదిపురుష్ భామ సందడి!

Published on Mon, 07/14/2025 - 20:09

ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్. చిత్రంలో ప్రభాస్ సరసన మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ ప్రస్తుతం లండన్లో వాలిపోయింది. ఇంగ్లాండ్లో జరుగుతున్న టీమిండియా మ్యాచ్లో తళుక్కున మెరిసింది. అయితే ఆమెతో పాటు బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న కబీర్ బహియా కూడా కనిపించారు. ఇద్దరు జంటగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో మరోసారి ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.

కృతి-కబీర్ డేటింగ్ రూమర్స్

అయితే జంట ఇలా కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. అప్పట్లో వీరిద్దరు కలిసి వచ్చిన ఓ వీడియో నెట్టంట వైరలైంది. పెళ్లిలో కృతి సనన్- కబీర్ చాలా సన్నిహితంగా కనిపించారు. లండన్కు చెందిన  వ్యాపారవేత్త అయినా కబీర్తో కలిసి చాలాసార్లు విహారయాత్రల్లోనూ కృతి కనిపించింది. అయితే వీరిద్దరికీ దాదాపు ఎనిమిదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఈ జంట ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని.. ఏడాదిలోనే వివాహం చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఇదే మ్యాచ్లో పలువురు బాలీవుడ్ తారలు కూడా హాజరై సందడి చేశారు. హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా సైతం లార్డ్స్ టెస్ట్మ్యాచ్కు హాజరయ్యారు. భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి మ్యాచ్ను వీక్షించారు.

Videos

పెళ్లి తర్వాత మాత్రం కలిసి ఉండలేకపోతున్నారు

భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ నిరసన

ఉప్పల హరికను పరామర్శించిన YSRCP నేతలు

శ్రీనివాసులు హత్య కేసులో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు: తాసిర్ తల్లి

YS Jagan Tweet: శభాష్ శుభాంశు..

Perni Kittu: మహానటి అని పేరు పెడతావా.. సిగ్గుందా.. నువ్వు మనిషిగా పుట్టుంటే..

ముగ్గుర్ని కన్నోళ్లే దేశభక్తులు బాబు అపరిపక్వ రాజకీయం

ఉప్పాల హారికను పరామర్శించిన YSRCP నేతలు

Palnadu: కొడుకుని తగలబెట్టిన తండ్రి

బిల్లు కట్టకుండా మందుబాబులు పరార్

Photos

+5

స్విట్జర్లాండ్ టూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న భార‌త క్రికెట‌ర్‌

+5

డల్లాస్ కన్సర్ట్‌లో దిల్‌రాజు దంపతులు సందడి (ఫొటోలు)

+5

సాహో శుభాంశు శుక్లా.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో (ఫొటోలు)

+5

మూడేళ్ల తర్వాత వచ్చేస్తున్న నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం బర్త్‌డే.. లైఫ్‌లో ప్రత్యేకమైన క్షణాలు (ఫోటోలు)

+5

600 మీటర్ల లోతు నీటి గుహలో ప్రయాణం..నరసింహ స్వామి దర్శనం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుపతిలో రైలు అగ్నిప్రమాదం (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)

+5

నటుడు అర్జున్ పెళ్లిలో హీరో జయం రవి డ్యాన్స్ (ఫొటోలు)

+5

'మోనికా' పాటతో ట్రెండింగ్‍‌లో పూజా హెగ్డే (ఫొటోలు)