ఉప్పాల హరికను పరామర్శించిన కొడాలి నాని
Breaking News
ట్రాన్స్ ఆఫ్ కుబేర.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!
Published on Mon, 07/14/2025 - 19:44
ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాలో ధనుశ్ బిచ్చగాడి పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా ఈ మూవీ ఓ క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. కుబేరలోని నాది నాది నాదే ఈ లోకమంతా అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ధనుష్, హేమచంద్ర ఈ సాంగ్ను ఆలపించగా.. కిశోర్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.
ఓటీటీకి కుబేర
విడుదలకు ముందే 'కుబేర' ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. 4 వారాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీంతో ఈ నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
Tags : 1