తెలివిలేక కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారు: కేటీఆర్
Breaking News
చాలా ఏళ్లు బతకాలని ఉంది.. అప్పుడే నన్ను చంపేయొద్దు: నెటిజన్లకు కరణ్ జోహార్ కౌంటర్
Published on Fri, 07/11/2025 - 19:27
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవలే ట్రైటర్స్ పేరుతో ఓ రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరించారు. అమెజాన్ ప్రైమ్లో ప్రసారమైన ఈ షోలో బిగ్‌బాస్ నటి ఉర్ఫీ జావెద్తో నికితా లూథర్ విజేతగా నిలిచారు. అయితే కొద్ది రోజుల క్రితం కరణ్ లుక్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరి బక్కచిక్కపోయి కనిపించడంతో అసలు ఏమైందని తెగ ఆరా తీశారు. ఇంత త్వరగా బరువు తగ్గడం ఎలా సాధ్యమంటూ నెటిజన్స్ ప్రశ్నించారు. కేవలం ఇంజక్షన్స్ ద్వారానే ఇలాంటివి సాధ్యమని కొందరు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తన వెయిట్ లాస్‌కు సంబంధించి వచ్చిన రూమర్స్పై మరోసారి స్పందించాడు. ధడక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన కరణ్ జోహార్ తాను బరువు తగ్గడంపై మాట్లాడారు. నెటిజన్స్ తనను ఏకంగా చంపేశారని అన్నారు. నేను చాలా ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు.
కరణ్ మాట్లాడుతూ..'నేను బరువు తగ్గడానికి ఒకే ఒక కారణం ఉంది. నేను జీవితంలో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా సవాళ్లను స్వీకరించా. నెటిజన్స్కు నేను చెప్పేది ఏంటంటే.. నా పిల్లల కోసం చాలా ఏళ్ల పాటు బతకాలనుకుంటున్నా. నేను ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని మీ అందరికీ పరిచయం చేస్తా' అని అన్నారు.
నెటిజన్స్ ట్రోల్స్
కాగా.. గతంలో కరణ్ జోహార్ ఓజెంపిక్‌ను ఉపయోగించడం లేదని చేసిన వాదనలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘ఓజెంపిక్‌తో మీరు బరువు తగ్గారని అంగీకరించడంలో తప్పు లేదు. బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. బరువు మీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది, మీరు బరువు తగ్గిన తర్వాత బాగానే ఉంటే, మీరు దానిని ఎలా కోల్పోయారన్నది ముఖ్యం కాదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో గర్వపడండి మీ డ్రీమ్ అదే కదా .. ఉన్నది ఒక్కటే జీవితం. మన శరీరంతో సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఆల్ ది బెస్ట్..’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘అది ఓజెంపిక్ ముఖమే.. దానిని అంగీకరించడంలో సిగ్గు లేదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిని ఉపయోగిస్తోంది .దాని గురించి బహిరంగంగా చెప్పే వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ ప్రశంసలు దక్కించుకుంటున్నారు. సార్ నిజం నిర్భయంగా చెప్పడి" అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. దీంతో తాజాగా తనపై హెల్త్‌పై వచ్చిన రూమర్స్‌పై రిప్లై ఇచ్చారు కరణ్ జోహార్.
Tags : 1