తీన్మార్ మల్లన్న నాపై అసభ్య కామెంట్స్ చేశారు: ఎమ్మెల్సీ కవిత
Breaking News
‘రఫ్ఫాడించేద్దాం’ అంటున్న చిరంజీవి.. ఆగస్ట్ 22 నుంచే బీ రెడీ..
Published on Tue, 07/08/2025 - 14:20
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), లేడీ సూపర్‌స్టార్ నయనతార జంటగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ సినిమా కోసం మినిమం గ్యారెంటీ కామెడీ-ఎమోషన్ మిక్స్‌కి ఫ్యాన్స్ ఇప్పటికే రెడీగా ఉన్నారు. ప్రస్తుతం “మెగా 157”(Mega 157) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రo షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తయింది. కానీ ఇంకా టైటిల్ పై క్లారిటీ రాలేదు.
తాజాగా టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు, అనిల్ రావిపూడి సినిమా ప్రచారానికి భారీ ప్లాన్ వేశారని, అంచెలంచెలుగా ప్రమోట్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు 22నుంచి ఈ సినిమా ప్రచారాన్ని భారీగా ప్రారంభించాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారని తెలిసింది. అదే రోజు టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేయనున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్‌పై ఆధారంగా ఉంటుంది. దీనిలో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుంది. చిరంజీవిని ఇటీవలి కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానుల అంచనాలు మరీ పెరిగిపోయాయి వాళ్ళు ‘‘గ్యాంగ్ లీడర్’’, ‘‘ఘరానా మొగుడు’’, ‘‘రౌడీ అల్లుడు’’ స్టైల్ ఎంటర్‌టైన్మెంట్ ని వీరిద్దరి కాంబో నుంచీ ఆశిస్తూన్నారు.
ఇంతకీ ఈ సినిమాకి ‘‘రఫ్ఫాడించేద్దాం’’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తారా? ఈ పదాన్ని సినిమా టీం తరచూ ప్రచారంలో ఉపయోగిస్తున్న నేపథ్యంలో అదే టైటిల్ అయ్యే అవకాశముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, విక్టరీ వెంకటేశ్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారట. ఇటీవల వెంకీ చేసిన ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’ సినిమాలోని పాత్రనే ఈ సినిమాలో కొనసాగించబోతున్నట్టు టాక్. రెండు సినిమాలను కలుపుతూ కొన్ని కీలక సీన్లు ఉండబోతున్నాయని సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రచారాన్ని మూడున్నర నెలల ముందే మొదలుపెట్టి, అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లాలని అనిల్ రావిపూడి బృందం భావిస్తోంది. మెగాస్టార్ మాస్ మ్యాజిక్‌తో, అనిల్ కామెడీ కట్‌తో ఈ చిత్రం ఇంకెన్ని సర్ప్రైజులు ఇవ్వబోతోందో వేచి చూడాల్సిందే!
Tags : 1