Breaking News

ఆలయంలో అబ్బురపరుస్తున్న బామ్మ

Published on Mon, 07/07/2025 - 19:33

చిత్రంలో కనిపిస్తున్న బామ్మ పేరు రాజి.. వయసు సుమారు 80 సంవత్సరాలపైనే ఉంటాయి. పాతికేళ్ల క్రితం హైద‌రాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు. అప్పటినుంచి అదే తన ఇల్లు.. అక్కడే ఉంటోంది.. గుడిలో ప్రసాదం తింటూ అక్కడే గడిపేస్తుంది.. సరిగ్గా నిటారుగా నుంచునే ఓపిక కూడా లేదు.. వయసు పైబడడంతో బామ్మ నడుము ఒంగిపోయింది. 

కానీ స్వామివారి ఆరగింపు సమయం వచ్చిందంటే చాలు వెంటనే గుడిలో ఏర్పాటు చేసిన 250 కిలోల భారీ గంట వద్దకు వడివడిగా వెళ్లిపోతుంది. 15 నిమిషాల పాటు జరిగే ఆరగింపు తంతు పూర్తయ్యే వరకూ గంట కొడుతూనే ఉంటుంది.. ఒక్క క్షణం కూడా ఆగదు.. ఇలా ప్రతిరోజూ మూడు సార్లు ఆరగింపు సమయాల్లో బామ్మ గంట కొట్టాల్సిందే.

గుడికి వచ్చిపోయే వాళ్లంతా బామ్మను చూస్తూ ఈ వయసులో ఈవిడకి ఇంత శక్తి ఎలా వస్తుందని ఆశ్చర్యపోతుంటారు.. తాను ఎవ్వరితోనూ మాట్లాడదు.. ఎలా గంట కొడుతున్నావ్‌ బామ్మా అని అడిగితే మాత్రం ఆ దేవుడే నాతో ఇలా కొట్టిస్తున్నాడని చెబుతుంది. ఆలయ ప్రధాన అర్చకుడు మురళీధర శర్మ బామ్మ గురించి చెబుతూ ఈ వయసులో కూడా ఆ బామ్మ అలా గంట కొడుతుండటం చూస్తే స్వామివారే ఆమెకు శక్తినిచ్చినట్లు అనిపిస్తుందని, తాను కూడా ఎంతో ఆశ్చర్యానికి లోనవుతుంటానని, ఇదంతా స్వామివారి దయని అన్నారు.             
– బంజారాహిల్స్‌  

చ‌ద‌వండి: ఆషాఢ శుక్ల ఏకాద‌శి బంగారుస్వామి

Videos

Anil Kumar: మేము CCTV ఫ్యూటేజీతో కేసు పెట్టి వారం రోజులు అయింది..

ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఖండించిన బీసీ నేత మారేష్

గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద YSRCP నేతల ధర్నా

సుప్రీం కోర్టు చేసిన సూచనలను EC పరిగణనలోకి తీసుకోవాలి: రాఘవులు

కూటమి పాలనలో ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు: సజ్జల

తిరుపతి రైలులో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే

కేసులు పెట్టుకోండి.. కోర్ట్లో తేల్చుకుంటాం

పాలేరు, నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల

Kuppam: గంగమ్మ అనే మహిళను కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టిన మంజునాథ్

తిరుపతిలో రైలు ప్రమాదం

Photos

+5

తిరుపతిలో రైలు అగ్నిప్రమాదం (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)

+5

నటుడు అర్జున్ పెళ్లిలో హీరో జయం రవి డ్యాన్స్ (ఫొటోలు)

+5

'మోనికా' పాటతో ట్రెండింగ్‍‌లో పూజా హెగ్డే (ఫొటోలు)

+5

ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహానికి ముగింపు.. సైనా, కశ్యప్‌ జంట విడాకులు (ఫొటోలు)

+5

బంజారాహిల్స్ : 'ట్రాషిక్' ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం సాగరతీరంలో సండే సందడి (ఫొటోలు)

+5

Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 13-20)

+5

కోట శ్రీనివాసరావు మృతి.. నివాళులు అర్పించిన ప్రముఖులు (ఫోటోలు)