Breaking News

'ఏ మాయ చేశావే నాగచైతన్యతో కాదు.. ఆ స్టార్‌ హీరోతో చేయాలని': డైరెక్టర్

Published on Wed, 07/02/2025 - 18:41

ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. నాగచైతన్య, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ సమంత ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇ‍చ్చింది. ఈ లవ్ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌  బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది.  ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్‌ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. అయితే మొదటి ఏ మాయ చేశావే చిత్రానికి హీరోగా నాగచైతన్యను అనుకోలేదని తెలిపారు. స్టార్ హీరో మహేశ్‌ బాబుతోనే తీద్దామని ఈ కథను రాసుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో చిరంజీవి గెస్ట్ రోల్‌గా పెట్టాలని అనుకున్నట్లు గౌతమ్ వాసుదేవ్ తెలిపారు. క్లైమాక్స్ భిన్నంగా ఉండాలని మెగాస్టార్‌తో ప్లాన్‌ చేశానని పేర్కొన్నారు.

కాగా.. జూలై 18న  'ఏమాయ చేసావె' రీ రిలీజ్‌ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.  ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా హిందీలో  'ఏక్ థా దీవానా' పేరుతో రీమేక్‌ అయింది. అక్కడ మాత్రం పరాజయం చవి చూసింది.
 

 

Videos

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్ చివరి రోజు ఆటకు వర్షం అంతరాయం

నాగమల్లేశ్వరరావు కేసులో గుంటూరు ఎస్పీకి YSRCP ఫిర్యాదు

హైటెన్షన్ విద్యుత్ పోల్ ఎక్కిన శ్యాం అనే వ్యక్తి

పరిశ్రమల పేరుతో రైతుల జీవితాలతో బాబు చెలగాటం: మేరుగు నాగార్జున

వైఎస్ జగన్ హయాంలో ఏపీలో పాఠశాలల రూపురేఖలు మారాయి: సినీనటుడు సుమన్

చిత్తూరుకు YS జగన్

Harish Rao: నీళ్ల విలువ తేలియని నాయకులు పాలకులుగా ఉన్నారు

Venkatram Reddy: కూటమి సర్కార్ కంటే YSRCP పాలనే బెటర్

గిట్టుబాటు ధరల్లేవని మామిడిని రోడ్డు పక్కన పడేస్తున్న రైతులు

చాలాకాలం తర్వాత వెలుగులోకి ఇరాన్ సుప్రీం లీడర్

Photos

+5

ప్రిన్స్ చార్లెస్, ఓప్రా విన్‌ఫ్రే మెచ్చిన ప్రదేశం..ఫిట్‌నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ ఇది..! (ఫోటోలు)

+5

భార్యతో ద్వారకా తిరుమల వెళ్లిన కమెడియన్‌ (ఫోటోలు)

+5

కుట్రాళం జలపాతాలు చూశారా... ???

+5

ఆద్యంతం ఉత్కంఠను రేపే మిస్టరీ పర్యాటక ప్రదేశాలివే..! (ఫోటోలు)

+5

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)