ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Published on Tue, 07/01/2025 - 16:03

ఆసియా మార్కెట్లలో ఆచితూచి ఆశావహ దృక్పథంతో భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సానుకూల ధోరణితో ఫ్లాట్ గా ముగిశాయి. ఇంట్రాడేలో 83,874.29 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 90.83 పాయింట్లు (0.11 శాతం) లాభపడి 83,697.29 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 24.75 పాయింట్లు లేదా 0.1 శాతం స్వల్ప లాభంతో 25,541.8 వద్ద ముగిసింది.

విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు ఫ్లాట్ గా స్థిరపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 0.10 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్కేర్, ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో, ఐటీ, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియల్టీ షేర్లు నష్టపోయాయి.

ఎన్ఎస్ఈలో 3,020 షేర్లలో 1,491 షేర్లు లాభాల్లో, 1,452 షేర్లు నష్టాల్లో ముగియగా, 77 షేర్లలో ఎలాంటి మార్పులేదు. 96 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 24 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. అప్పర్ సర్క్యూట్ ను తాకిన స్టాక్స్ సంఖ్య 119కి పెరగ్గా, లోయర్ సర్క్యూట్ పరిమితులకు 43 పడిపోయాయి.

ఎన్ఎస్ఈలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.36 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.01 శాతం క్షీణించి 12.5 పాయింట్ల వద్ద స్థిరపడింది.

Videos

పవన్ నిన్ను నమ్ముకుంటే.. అడుక్కునే స్టేజికి తీసుకొచ్చావ్..

అమెరికాను కుదిపేస్తున్న ట్రంప్ తెచ్చిన One Big Beautiful Bill

ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో VRSకు దరఖాస్తు

రెండో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి

ఛీ..ఛీ.. ఇదేం తిండి!

మీ భవిష్యత్తు నాది..! కార్యకర్తలకు జగన్ భరోసా

ఈ గేదె ధర.. 14 లక్షలు

Vallabhaneni Vamsi: అన్ని కేసుల్లో బెయిల్.. నేడే విడుదల..!

KSR లైవ్ షో: ఐపీఎస్ పోస్టుకు సిధ్ధార్థ్ కౌశల్ గుడ్ బై!

బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన సభా వేదికపై అసంతృప్తి గళాలు

Photos

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)

+5

ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)

+5

‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అందాల శ్రీలంక..అద్భుత ఎంపిక (ఫొటోలు)

+5

బల్కంపేట : వైభవోపేతంగా ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం..ఉప్పొంగిన భక్తిభావం (ఫొటోలు)

+5

ఈ ఏడాది చాలా స్పెషల్.. పెళ్లి రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మహాతల్లి జాహ్నవి..!

+5

ఔరా..! అనిపించే ఆరోవిల్లే టూరిజం..! ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పర్యాటక ప్రదేశం

+5

'అట్లీ' సినిమా కోసం ముంబై బయల్దేరిన అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

విశాఖపట్నం : సాగరతీరంలో సందర్శకుల సందడి (ఫొటోలు)