Breaking News

మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు

Published on Tue, 06/03/2025 - 15:13

మన దగ్గర తక్కువ గానీ బాలీవుడ్‌లో ప్రేమ, బ్రేకప్ అనేవి చాలా ఎ‍క్కువగా వినిపిస్తుంటాయి. కలిసి సినిమా చేయడం లేటు తెగ రూమర్స్ వచ్చేస్తాయి. వాటిలో కొన్ని నిజమవుతుంటాయి. కొన్ని మాత్రం ఆదిలో ఆగిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే అప్పట్లో ప్రేమించుకున్నారనే రూమర్స్ వచ్చి, విడిపోయిన ఓ జంట.. చాన్నాళ్ల తర్వాత మళ్లీ కలిశారు. రొమాంటిక్ మూవీ కూడా చేయబోతున్నారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?

(ఇదీ చదవండి: ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?)

బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్.. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. గతంలో 'పతీ పత్ని ఔర్ ఓ' మూవీ చేస్తున్న టైంలో హీరోయిన్ అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు వచ్చాయి. తర్వాత 'కాఫీ విత్ కరణ్' షోలో ఈ విషయమై మాట్లాడిన కరణ్ జోహార్.. వాళ్లకు బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చాడు. కొన్నాళ్ల క్రితం ఇదే కరణ్ జోహార్.. 'దోస్తానా 2' విషయమై కార్తీక్ ఆర్యన్‌తో గొడవపడ్డాడు. ఇకపై తన నిర్మాణ సంస్థలో కార్తీక్‌తో సినిమాలు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు.

కట్ చేస్తే ఇప్పుడు అదే కరణ్ జోహార్.. కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా 'తూ మేరీ మైన్ తేరా, మైన్ తేరా తూ మేరీ' సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది వాలంటైన్స్ సందర్భంగా ఫిబ్రవరి 13న మూవీ థియేటర్లలోకి వస్తుందని చెప్పారు. దీంతో కార్తీక్-అనన్యతో పాటు కార్తీక్-కరణ్ జోహార్ మళ్లీ కలిసిపోయారనే టాక్ వినిపిస్తోంది.

(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు' మళ్లీ వాయిదా?)

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)