Breaking News

రిలీఫ్‌ ర్యాలీ.. లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Published on Fri, 05/23/2025 - 09:47

శుక్రవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 728.96 పాయింట్లు లేదా 0.90 శాతం లాభంతో.. 81,680.95 వద్ద, నిఫ్టీ 239.25 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 24,848.95 వద్ద నిలిచాయి.

సిగ్మా సాల్వ్, ఖైతాన్ (ఇండియా), క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్, అపోలో పైప్స్, హొనస కన్స్యూమర్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, కృతి న్యూట్రియంట్స్, సంఘ్వీ మూవర్స్, ది గ్రోబ్ టీ, యూఎఫ్ఓ మూవీజ్ ఇండియా వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఇటీవల భారీగా పడిన మార్కెట్లలో ఈ రోజు రిలీఫ్‌ ర్యాలీ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 173 పాయింట్లు పెరిగి 24,783కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 508 ప్లాయింట్లు ఎగబాకి 81,466 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.82 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 63.93 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌తో పోలిస్తే స్థిరంగా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.04 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.28 శాతం లాభపడింది.

అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్‌ సూచీలు గురువారం అరశాతానికిపైగా నష్టపోయాయి. అమెరికా ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు, బాండ్లపై రాబడులు పెరగడంతో ఐటీ, ఆయిల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా నిన్నటి మార్కెట్‌ సెషన్‌లో సెన్సెక్స్‌ 645 పాయింట్లు నష్టపోయి 80,952 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 204 పాయింట్లు కోల్పోయి 24,610 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్‌ 1,107 పాయింట్లు క్షీణించి 80,490 వద్ద, నిఫ్టీ 351 పాయింట్లు పతనమై 24,462 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. యూఎస్‌ బాండ్లపై రాబడులు 5% మించగా, జపాన్‌ బాండ్‌ ఈల్డ్స్‌ 3.5 శాతానికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు డీలాపడ్డాయి.

ఇదీ చదవండి: భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్‌లో వేడుకలు

రూపాయి 36 పైసలు క్రాష్‌

విదేశీ బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ పెరగడంతో నిన్న రూపాయి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. డాలర్‌ మారకంలో 36 పైసలు క్షీణించి 85.95 వద్ద స్థిరపడింది. అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం ప్రపంచ ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. మధ్యప్రాచ్య దేశాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోవడంతో క్రూడాయిల్‌ ధరలు పెరిగాయి. ఈ పరిణామాలూ దేశీయ కరెన్సీపై ప్రభావాన్ని చూపాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

మరోసారి వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత

త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)