73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
Published on Thu, 05/22/2025 - 11:40
టాలీవుడ్ నటి అనసూయ ఇంట మరో వేడుక జరిగింది. ఇటీవలే నూతన గృహ ప్రవేశం చేసిన అనసూయ.. తాజాగా తన పెద్ద కుమారుడికి ఉపనయనం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తన కుమారుడు శౌర్య భరద్వాజ్‌కు సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకను జరుపుకున్నారు. ఉపనయనం అంటే మన ఆధ్యాత్మిక పద్ధతులను పాటించండం, వైదిక సంప్రదాయంలో ప్రకారం ఉపనయన వేడుకలో శరీరంపై యజ్ఞోపవీతం (పవిత్ర దారం) ధరిస్తారు. ఈ వేడుకకు సంబంధించిన వేడుకను అనసూయ తన ఇన్‌స్టాలో పంచుకుంది.
అనసూయ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా పెద్ద కొడుకు ప్రియమైన శౌర్యభరద్వాజ్.. నీకు ఈ అధికారిక వేడుక అవసరం లేదని నేను ఎప్పుడూ అనుకోలేదు.. కానీ ఈరోజు నీ ఉపనయనం వేడుకతో నీ తల్లిదండ్రులుగా, కుటుంబంగా మేమంతా కలిసి ఆధ్యాత్మిక పునర్జన్మలోకి అడుగుపెట్టాం. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలు, సూత్రాలు, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా.. మన సాంస్కృతిని కొనసాగించేలా వాగ్దానాన్ని తీసుకున్నాం. నువ్వు మన సంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి మాకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. ఆ హనుమాన్ జీ శక్తి నిన్ను ఎల్లప్పుడూ నీతి మార్గంలో నడిపిస్తుంది' అంటూ పోస్ట్ చేసింది. ఇవాళ హనుమాన్ జయంతి కావడంతో అనసూయ ఈ శుభకార్యం చేపట్టినట్లు తెలుస్తోంది.
కాగా.. ఇటీవలే టాలీవుడ్ స్టార్ నటి అనసూయ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది. తన జీవితంలో మరో కొత్త అధ్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది. అంతేకాకుండా తన కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టింది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తన కొత్త ఇంటిలో జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వివరిస్తూ అనసూయ పోస్ట్ చేసింది. ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలైన హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం గురించి వివరిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. మా ఇంటికి సంజీవని అని పేరు పెట్టాలనుకున్నామని.. కానీ గురువు(పూజారి) సూచనలతో శ్రీరామసంజీవని అని పెట్టుకున్నామని తెలిపింది. ఆ రోజే మా ఇంటికి ఆంజనేయుడు వచ్చాడని గురువు తన ఫోన్‌లో ఫోటోను చూపించారని భావోద్వేగానికి గురైంది.
ఉపనయనం అంటే ఏమిటి?
ఉపనయనం అనేది ఒక ప్రాచీన హిందూ ఆచారం. ఇది వేదాధ్యయనానికి, ఆధ్యాత్మిక జీవితానికి, సమాజంలో గౌరవప్రతిష్టను అందుకోవడానికి ప్రారంభంగా భావిస్తారు. ఉపనయనం విద్యాభ్యాసం, గురువు-శిష్య సంబంధంలో ముఖ్యమైన దశగా చెబుతారు. ఈ ఆచారం ముఖ్యంగా హిందూ కుటుంబాల్లో కనిపిస్తుంది. ఈ ఆచారం సాధారణంగా అబ్బాయిలకు విద్య నేర్చుకునే తొలి దశగా పరిగణిస్తారు.

ఈ ఆచారం అబ్బాయిలకు సంబంధించినది అయినప్పటికీ.. ఆధునిక కాలంలో అమ్మాయిలకు కూడా ఈ ఆచారం నిర్వహిస్తున్నారు. అయితే, ఇది సంప్రదాయబద్ధంగా చూస్తే కేవలం అబ్బాయిలకు మాత్రమే నిర్వహిస్తారు. పురాణాలలో, హిందూ ధర్మంలో ఈ ఆచారం అబ్బాయిలకే జరిపినట్లుగానే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఉపనయనం వేడుకను సాధారణంగా పిల్లల వయస్సు 7 నుండి 16 సంవత్సరాల మధ్య చేయడం ఉత్తమమని భావిస్తారు. దీనికి కారణం, ఈ వయస్సులో పిల్లలు మానసికంగా, శారీరకంగా బలంగా మారేదశగా గుర్తిస్తారు. ఈ ఆచారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖాండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా పాటిస్తారు.
Tags : 1