73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ఐశ్వర్యరాయ్
Published on Thu, 05/22/2025 - 10:49
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సందడి చేసింది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా వైట్ శారీలో మెరిసింది. నుదుటన సింధూరం ధరించిన కేన్స్ ఫెస్టివల్‌లో పాల్గొనడం మరింత ఆసక్తిగా మారింది. ఇటీవల పాకిస్తాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌కు భారత ప్రభుత్వం సింధూర్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకగానే ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సింధూరం పెట్టుకుని కనిపించింది. గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు కేన్స్ వేదికగా తన లుక్‌తో మద్దతుగా నిలిచారు ఐశ్వర్య. ఈ సందర్భాన్ని చాటిచెప్పేలా ఐశ్వర్య సిందూరం పెట్టుకుని బలమైన సందేశం ఇచ్చారని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరుగుతోంది. ఈ సారి వేడుకల్లో చీరకట్టులో మెరిసిన ఐశ్వర్యరాయ్ ఆమె నటించిన దేవదాస్ సినిమాను గుర్తుకు తెచ్చారు. 2002లో తొలిసారి ఐశ్వర్య కేన్స్ ఫెస్టివల్‌కు చీరకట్టులో హాజరయ్యారు. సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ చిత్రం కోసం ఈ వేడుకల్లో చీరలో కనిపించారు. కొత్త లుక్‌ను చూసిన తర్వాత అభిమానులు దేవదాస్ చిత్రంలోని పార్వతిని గుర్తు చేసుకుంటున్నారు.
ఎందుకంటే ఐశ్వర్యరాయ్ ఎప్పుడూ కనిపించినా ఫ్యాషన్ దుస్తుల్లోనే మెరిశారు. సినీ వేడుకల్లో ఐశ్వర్య లుక్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ ఏడాది ఆమె లుక్ మాత్రం అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ ష్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆె చీరను డిజైన్ చేశారు. ఆమె ధరించిన నెక్లెస్‌ను 500 క్యారెట్ల మొజాంబిక్ కెంపులు, వజ్రాలతో తయారు చేశారు.
Tags : 1