బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం
Breaking News
కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్
Published on Sat, 05/17/2025 - 17:31
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్.. దాదాపు 36 సంవత్సరాల తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి పనిచేశాడు. అదే 'థగ్ లైఫ్' సినిమా. జూన్ 5న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టగా.. తాజాగా తెలుగు, తమిళ ట్రైలర్స్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్)
ట్రైలర్ బట్టి చూస్తే ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామా అని క్లారిటీ వచ్చేసింది. కమల్ హాసన్ గ్యాంగ్ స్టర్ కాగా.. అతడి దగ్గర శింబు పెరిగి పెద్దవాడవుతాడు. కానీ పెద్దయ్యాక కమల్-శింబు మధ్య గ్యాప్ వస్తుంది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన కమల్.. తిరిగొస్తే ఏం జరిగింది? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.
ఇందులో కమల్ హాసన్ కి జోడీగా అభిరామి, త్రిష నటించారు. శింబు సరసన సన్య మల్హోత్రా చేసింది. వీళ్లు కాకుండా ఐశ్వర్య లక్ష‍్మీ, జోజూ జార్జ్, నాజర్, గౌతమ్ కార్తీక్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ట్రైలర్ చూస్తే మంచి రిచ్ గా ఉంది. చూస్తుంటే 'విక్రమ్'లా కమల్ మరో హిట్ కొడతాడనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
(ఇదీ చదవండి: 'సీతారామం' నటి కారులో భారీ చోరీ)
Tags : 1