Breaking News

ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా

Published on Mon, 05/05/2025 - 20:15

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా 15కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు యాడ్ అయింది. అస్సలు ఇంగ్లీష్ పదాలే వాడకుండా తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుందని ఇప్పుడు చూద్దాం?

అందరూ కొత్తవాళ్లతో తీసిన సినిమా 'కాలమే కరిగింది?'. మార్చి 21న ఈ తెలుగు మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఈ మూవీలో సారీ, థ్యాంక్స్ తప్ప మరే ఇంగ్లీష్ పదాలు ఉపయోగించలేకపోవడం విశేషం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 

కథంతా స్కూల్‌ లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు ఎంచుకున్న లవ్‌స్టోరీ పాయింట్‌ కొత్తదేమి కాదు. కానీ అ‍ప్పటి  ప్రేమకథల్లో ఉండే మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని కవితాత్మకంగా సరికొత్తగా చూపించారు. స్కూల్ డేస్ లోని బాల్యప్రేమను మధురంగా మలిచారు. ఇప్పుడీ చిత్రం మే 09 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.

'కాలమే కరిగింది?' విషయానికొస్తే.. ఫణి (వినయ్ కుమార్-అరవింద్) బాగా చదువుకుని జీవితంలో సెటిల్ అయ్యింటాడు. తొలి ప్రేమ గుర్తొచ్చి ప్రియురాలు బిందు (శ్రావణి-నోమిన తార) కోసం సొంతూరు వెళ్తాడు. అసలు బిందు ఎక్కడ ఉంది? ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఫణికి బిందు కలిసిందా లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: స్నానం కూడా చేయలేదు.. అమ‍్మ జీవితాంతం నన్ను..: రష్మీ) 

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)