వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు
Breaking News
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
Published on Mon, 05/05/2025 - 15:15
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి సమంత నిర్మించిన 'శుభం', శ్రీ విష్ణు కామెడీ సినిమా '#సింగిల్', బ్లైండ్ స్పాట్, కలియుగమ్ 2064 తదితర చిత్రాలు రానున్నాయి. మరోవైపు చిరంజీవి-శ్రీదేవి క్లాసిక్ మూవీ 'జగదేకవీరుడు అతిలోక సుందరి' రీ రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం 15కి పైగా సినిమాలు- సిరీసులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్, ది డిప్లమాట్ చిత్రాలతో పాటు గ్రామ చికిత్సాలయ్ అనే సిరీస్ ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏ మూవీస్ రాబోతున్నాయంటే?
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (మే 05-11వ తేదీ వరకు)
నెట్ ఫ్లిక్స్
బ్రిటైన్ అండ్ ద బ్లిట్జ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 05
కొనన్ ఓ బ్రయన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 05
మైటీ మానస్టర్ వీలీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05
ద సీట్ (ఇంగ్లీష్ సినిమా) - మే 05
ది మ్యాచ్ (ఇంగ్లీష్ చిత్రం) - మే 07
లాస్ట్ బులెట్ (ఇంగ‍్లీష్ సినిమా) - మే 07
గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 08
జాక్ (తెలుగు సినిమా) - మే 08
ది డిప్లమాట్ (హిందీ మూవీ) - మే 09
ద రాయల్స్ (హిందీ సిరీస్) - మే 09
అమెజాన్ ప్రైమ్
గ్రామ చికిత్సాలయ్ (హిందీ సిరీస్) - మే 09
హాట్ స్టార్
యువ క్రైమ్ ఫైల్స్ సీజన్ 1 (హిందీ సిరీస్) - మే 05
యెల్లో స్టోన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05
పోకర్ ఫేస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09
జీ5
బోహుర్పీ (బెంగాలీ సినిమా) - మే 09
(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!)
Tags : 1