మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్స్‌ పెరగాలి | Sakshi
Sakshi News home page

మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్స్‌ పెరగాలి

Published Fri, Mar 1 2024 5:00 AM

Medtronic expands Engineering and Innovation Centre in Hyderabad: ts - Sakshi

హైదరాబాద్‌ మెడ్‌టెక్‌ ఆవిష్కరణలకు హాట్‌స్పాట్‌గా ఎదుగుతోంది

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

నానక్‌రాంగూడలో మెడ్‌ట్రానిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ప్రారంభం  

రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్స్‌ పెరగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. నానక్‌రాంగూడలో నూతనంగా విస్తరించిన మెడ్‌ట్రానిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను గురువారం ఆయన అమెరికా కాన్సులేట్‌ (హైదరాబాద్‌) కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌ నగరంలో ఎంఈఐసీ ఉండటం మెడ్‌టెక్‌ ఆవిష్కరణలకు హాట్‌స్పాట్‌గా ఎదుగుతుందనడానికి నిదర్శనమన్నారు.

ఈ ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. వైద్య పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధికి ఆదర్శవంతమైన గమ్య స్థానంగా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెడ్‌ట్రానిక్‌ సంస్థ అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంస్థ పురోభివృద్ధికి పూర్తి సహకారం అందించేందుకు ఎప్పుడూ సి ద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ మాట్లాడుతూ, అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్‌అండ్‌డీ సెంటర్లను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నా రు. మెడ్‌ట్రానిక్‌ చైర్మన్, సీఈఓ జెఫ్‌మార్తా మాట్లా డుతూ ఆర్‌అండ్‌డీ సౌకర్యాన్ని విస్తరించడానికి, భవిష్యత్తులో 1,500 మందికి ఉపాధి కల్పించడానికి మెడ్‌ట్రానిక్‌ ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో విస్తరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంఈఐసీ ఉపాధ్యక్షుడు, సైట్‌ లీడర్‌ దివ్యప్రకాశ్‌ జోషి మాట్లాడారు. అనంతరం మంత్రి మెడ్‌ట్రానిక్‌ సంస్థ ద్వారా ఉత్పత్తి చేసిన యంత్ర పరికరాలు వాటి పనితీరును వివరంగా అడిగి తెలుసుకున్నారు. 

ఫోర్సిస్‌ ఇంక్‌ నూతన కార్యాలయం ప్రారంభం 
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు పూర్తిగా అనుకూలంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఫోర్సిస్‌ ఇంక్‌నూతన కార్యాలయాన్ని శ్రీధర్‌బాబు, అమెరికా కాన్సులేట్‌ (హైదరాబాద్‌) కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సా మాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకు రావాలన్నారు. జెన్నిఫర్‌ లార్సన్‌ మాట్లాడుతూ భారతదేశం, అమెరికా భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా బలమైన ద్వైపాక్షిక స్నేహంగా ముందుకు సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఫోర్సిస్‌ సంస్థ వ్యవస్థాపకులు జేపీ వేజెండ్ల, ఐల్యా బ్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ శ్రీనివాసరాజు మాట్లాడారు.

Advertisement
Advertisement