వంద శాతం టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలి | Sakshi
Sakshi News home page

వంద శాతం టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలి

Published Sun, May 19 2024 12:20 AM

వంద శాతం టీకాల  లక్ష్యాన్ని చేరుకోవాలి

రాయచోటి అర్బన్‌: వంద శాతం టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్యమిషన్‌ పర్యవేక్షణ అధికారి(డీపీఎంఓ) డాక్టర్‌ రియాజ్‌బేగ్‌ అన్నారు. శనివారం పట్టణంలోకి కొత్తపల్లె పీహెచ్‌సీ పరిధిలోని రెడ్డీస్‌ కాలనీ సచివాలయంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కేంద్రాన్ని ఆయన డీఎన్‌ఎంఓ విష్ణువర్దన్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారుల జాబితా ప్రకారం వారికి ముందస్తుగా సమాచారం అందించి వారు కచ్చితంగా టీకాలు వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. శిశువుల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గురించి తల్లులను అడిగి తెలుసుకోవాలన్నారు. అవసరమైతే వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. మరీ అవసరమనుకుంటే ఏరియా ఆసుపత్రిలోని చిన్నపిల్లల నిపుణుల దగ్గరకు తీసుకెళ్లి వైద్యం అందించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సచివాలయం ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

20 నుంచి జేవీవీ

వేసవి శిక్షణా శిబిరం

కడప కల్చరల్‌ : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రత్యేకంగా ఈనెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏడీ దేవదత్తం తెలిపారు. శనివారం రామకృష్ణనగర్‌లోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో శిబిరం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవిలో సంస్థ ఆధ్వర్యంలో విజ్ఞాన దాయకమైన శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement