హెచ్‌ఐవీ బాధితులకు అండ.! | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ బాధితులకు అండ.!

Published Sun, May 19 2024 12:20 AM

హెచ్‌

మదనపల్లె సిటీ: హెచ్‌ఐవీ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వ్యాధి నివారణకు చర్యలు చేపడుతోంది. వ్యాధిగ్రస్తులకు ఐసీటీసీ కేంద్రాల్లో కౌన్సెలింగ్‌ ఇస్తూ వారిలో మనోధైర్యం కల్పిస్తున్నారు. ప్రతి ఏడాది మే మూడవ ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్‌ సంస్మరణ దినం నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ వారి పట్ల ప్రేమ, సంఘీభావం తెలియజేద్దాం.. వారి కుటుంబ సభ్యుల బాధను నయం చేద్దాం.. అనే నినాదం ఇచ్చారు. వ్యాధితో మృతి చెందిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పిస్తారు.

● హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారికి ఏఆర్‌టీ (యాంటీ రిట్రోవైరల్‌) కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. ఆత్మసైర్థ్యాన్ని నింపేలా కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు అవసరమైన మందులను అందిస్తున్నారు. జిల్లాలో మదనపల్లెలో ఏఆర్‌టీ కేంద్రం ఉంది. దీంతో పాటు రాయచోటి, పీలేరు ఏఆర్‌టీ ప్లస్‌, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, వాల్మీకిపురం, రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, రైల్వేకోడూరులలోని ప్రభుత్వ సీహెచ్‌సీలలో లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాలున్నాయి. ఆయా ఐసీటీసీ కేంద్రాల్లో నిర్వహించే రక్తపరీక్షల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉందని తేలితే వారికి కౌన్సెలింగ్‌ ఇస్తూ వారిలో మనోధైర్యం నింపుతున్నారు. వారందరిని ఏఆర్‌టీ కేంద్రాల్లో నమోదు చేసి మందులు అందజేస్తారు. నేషనల్‌ ఎయిడ్స్‌ ఆర్గనైజేషన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో వ్యాధిని రూపుమాపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. హెచ్‌ఐవీ వచ్చాక బాధపడేకన్నా దాని బారిన పడకుండా చూసుకోవాలని పలు కార్యక్రమాలతో చైతన్యం పెంచుతున్నారు. గతంతో పోలిస్తే బాధితులకు మందులు సకాలంలో అందిస్తుండటంతో ఆరోగ్యం మెరుగవుతోంది. ఏటా పరీక్షల సంఖ్యను పెంచుతూ పాజిటివ్‌ కేసులను గుర్తిస్తున్నారు. హెచ్‌ఐవీ పాజిటివ్‌ గల గర్భిణికి ముందుగా పీపీటీసీటీ చికిత్స అందిస్తూ పుట్టబోయే బిడ్డను ఎయిడ్స్‌ నుంచి కాపాడే ప్రయత్నాలు జిల్లాలో జరుగుతున్నాయి.

పోషకాహారం: బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటోంది. వారికి పింఛన్‌తో పాటు పలు సంస్థల సహకారంతో పోషకాహారం అందిస్తున్నారు. స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

ఐసీటీసీ కేంద్రాలు

మదనపల్లె, పీలేరు, వాల్మీకిపురం, బి.కొత్తకోట,తంబళ్లపల్లె, రాయచోటి, రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, రైల్వేకోడూరు

ఏఆర్‌టీ కేంద్రం: మదనపల్లె

కౌన్సెలింగ్‌తో మనోధైర్యం

ఉచితంగా మందులు పంపిణీ

అవగాహన కల్పిస్తున్నాం

జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాం. కళాబృందాల ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాం. బాధితులకు అండగా నిలుస్తున్నాం. వారికి మనోధైర్యం కల్పిస్తున్నాం. ఆదివారం సాయంత్రం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవ్వొత్తులు వెలిగించి మరణించిన వారి ఆత్మశాంతి కోసం నివాళులు అర్పిస్తాం. –డాక్టర్‌ శైలజ,

జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి, రాయచోటి

హెచ్‌ఐవీ బాధితులకు అండ.!
1/1

హెచ్‌ఐవీ బాధితులకు అండ.!

Advertisement
 
Advertisement
 
Advertisement