No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, May 19 2024 12:15 AM

-

పైతట్టు ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు మండల పరిధిలోని రాజోలి ఆనకట్టకు వచ్చి చేరుతోంది. ఆనకట్ట నుంచి కుందూనదిలో 862 క్యూసెక్కులు పోతున్నట్లు కేసీ కెనాల్‌ అధికారులు తెలిపారు. 20 రోజుల కిందట అవుకు రిజర్వాయర్‌ నుంచి పాలేరు వాగు ద్వారా రాజోలి ఆనకట్ట నుంచి కుందూనదికి నీటిని విడుదల చేశారు. అప్పటి నుంచి కుందూ నదిలో నీరు అరకొరగా ప్రవహిస్తోంది. ఆ నీటితో పశువులు, మేకలు, గొర్రెలకు తాగునీటి అవసరాలు తీరాయని రైతులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షం నీటితో శనివారం రాజోలి ఆనకట్ట నుంచి కుందూ నదిలోకి నీరు పోవడంతో జలకళ సంతరించుకుంది. –రాజుపాళెం

Advertisement
 
Advertisement
 
Advertisement