ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు | Sakshi
Sakshi News home page

ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు

Published Sun, May 19 2024 12:15 AM

ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు

జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌

కడప అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ జూన్‌ 4న జరుగనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ పేర్కొన్నారు. శనివారం కడప వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీస్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్‌ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఎవరు, ఎలా విధులు నిర్వహించాలో ఆదేశాలిచ్చారు. కౌంటింగ్‌ నేపథ్యంలో జూన్‌ 1 నుంచి 6 వరకు ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే రాజకీయ నేతల గృహ నిర్బంధాలు, జిల్లా బహిష్కరణ అమలు చేయడం జరుగుతందని వివరించారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై కూడా నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో కడప డీఎస్పీ ఎండీ షరీఫ్‌, ఎస్‌బీ ఇన్‌స్పెపెక్టర్‌ జి. రాజు, కడప వన్‌టౌన్‌ సీఐ సి. భాస్కర్‌రెడ్డి, చిన్నచౌక్‌ సీఐ నరసింహారెడ్డి, కడప టూటౌన్‌ సీఐ ఇబ్రహీం, తాలూకా సీఐ తిమ్మయ్య, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద గట్టి భద్రత

సార్వత్రిక ఎన్నికల పోలింంగ్‌ అనంతరం ఈవీఎం బాక్స్‌లను కడపలోని మౌలానా అజాద్‌ ఉర్దూ నేషనల్‌ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘స్ట్రాంగ్‌ రూమ్‌’లో ఉంచారు. ఇక్కడ భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌, జాయింట్‌ కలెక్టర్‌ సి. గణేష్‌కుమార్‌తో కలిసి సంయక్తంగా పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని, సిబ్బంది, అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ (ఏ.ఆర్‌) ఎస్‌.ఎస్‌.ఎస్‌.వి కృష్ణారావు, కడప డీఎస్పీ ఎండీ షరీఫ్‌, ఏ.ఆర్‌ డిఎస్పీ మురళీధర్‌, కడప రిమ్స్‌ పిఎస్‌ సీఐ కె. రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

జూన్‌ 1నుంచి 6 వరకు ర్యాలీలు,

ఊరేగింపులు నిషేధం

జమ్మలమడుగు: ఎన్నికల కౌటింగ్‌ నేపథ్యంలో జూన్‌ ఒకటి నుంచి ఆరో తేదీ వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు ఇవ్వకూడదని, వాటిని పూర్తిగా నిషేధించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక అర్బన్‌ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. ఏ పార్టీలకు కొమ్ము కాయొద్దని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ యశ్వంత్‌ ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రాజు, సీఐలు కరుణాకర్‌, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement