ప్రభాకర్‌ రెడ్డి మీద జరిగిన దాడి కాదు. కేసీఆర్‌ మీద జరిగింది: కేసీఆర్‌ ఫైర్‌

KCR At banswada Meeting Condemn Attack On MP Kotha Prabhakar Reddy  - Sakshi

సాక్షి, కామారెడ్డి: అతికష్టం మీద తెలంగాణను సాధించుకున్నామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఉప్పెనలా ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిందని, 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. మెదడు కరిగించి తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. బాన్సువాడలో సోమవారం బీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. 

బాన్సువాడలో అన్ని నియోజకవర్గాలకంటే ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు. పోచారం సారథ్యంలో బాన్సువాడ బంగారువాడలా మారిందని ప్రశంసించారు. బాన్సువాడలో 11 వేల డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టించామని తెలిపారు.

పెద్ద పెద్ద రాష్ట్రాల్లో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌లో ఉందని తెలిపారు. అభివృద్ధికి ఏకైక కొలమానం తలసరి ఆదాయమని చెప్పారు. పదేళ్లు నీతి, నిబద్ధతో పనిచేస్తేనే అది సాధ్యమైందని పేర్కొన్నారు. 

చేతకాని దద్దమ్మలు కత్తిపోట్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మొండి కత్తి మాకూ దొరకదా అనిప్రశ్నించారు. ప్రజా సేవ చేస్తే దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌ రెడ్డి మీద జరిగిన దాడి కాదని.. కేసీఆర్‌ మీద జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
చదవండి: మెదక్‌ ఎంపీపై దాడి ఘటనపై గవర్నర్‌ సీరియస్‌, డీజీపీకి ఆదేశాలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top