విదేశాల్లో శిక్షణ | Sakshi
Sakshi News home page

విదేశాల్లో శిక్షణ

Published Thu, Feb 29 2024 5:32 AM

Ranveer Singh and Kiara Advani to receive specialized stunt training to perform stunts in Don 3 - Sakshi

ఇంటర్‌నేషనల్‌ ట్రైనింగ్‌కు రెడీ అవుతున్నారు కియారా అద్వానీ. బాలీవుడ్‌ ‘డాన్‌’ ఫ్రాంచైజీలో వస్తున్న లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘డాన్‌ 3’. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించనున్నారు. ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వం వహించనున్న ‘డాన్‌ 3’లో కియారా అద్వానీ హీరోయిన్‌.

ఈ చిత్రంలో రణ్‌వీర్, కియారా.. ఇద్దరికీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉంటాయట. దీంతో అంతర్జాతీయ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ పర్యవేక్షణలో ఇద్దరూ స్టంట్స్‌ నేర్చుకోనున్నారని బాలీవుడ్‌ టాక్‌. విదేశాల్లో ఈ శిక్షణ జరుగుతుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది సెప్టెంబరులో ్ర΄ారంభం కానుందని తెలిసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement