జిల్లా వ్యాప్తంగా నాయకులకు బహిష్కరణ నోటీసులు | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా నాయకులకు బహిష్కరణ నోటీసులు

Published Thu, May 30 2024 12:00 PM

-

కడప అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ నేనేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రౌడీషీట్‌, సస్పెక్ట్‌ షీట్స్‌ కలిగిన వారికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి విజయరామరాజు, ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ ఆధ్వర్యంలో బహిష్కరణ నోటీసులను సిద్ధం చేశారు. ఈ నోటీసులను ఒక పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లోని రాజకీయ ప్రతినిధులకు, కార్యకర్తల్లో కొందరికి ఆయా పోలీసు అధికారులు, సిబ్బంది ద్వారా అందచేసినట్లు సమాచారం. రానున్న రెండు రోజుల్లో మిగతా వారికి కూడా నోటీసులను అందజేయనున్నారు. జూన్‌ 1 వ తేదీ నుంచి జూన్‌ 6వ తేదీ వరకు వారు జిల్లా కేంద్రానికి రాకూడదని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కాకుండా మిగిలిన ప్రజాప్రతినిధుల్లో కొందరికి నోటీసులు అందించనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement