●భారీగా తగ్గిన దిగుబడులు | Sakshi
Sakshi News home page

●భారీగా తగ్గిన దిగుబడులు

Published Thu, May 30 2024 12:00 PM

●భారీ

సాక్షి రాయచోటి: ఈ ఏడు మామిడి దిగుబడి బాగా తగ్గింది. అకాల వర్షాలు, చలి, మంచుతోపాటు తెగుళ్లు దెబ్బ మామిడిపై ప్రభావం చూపింది. దీంతో మామిడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు కష్టం నేలపాలై.. కన్నీళ్లే మిగిలాయి. అనుకున్న సమయంలో పూత రాకపోవడం..అటు, ఇటు కాని సమయంలో వర్షం కురవడంతోపాటు ప్రకృతి కూడా చలి, మంచు రూపంలో మామిడి రైతులను కోలుకోకుండా చేసింది. ఏటా జిల్లా నుంచి సుమారు రూ. 200 కోట్ల మేర మామిడిపై వ్యాపార లావాదేవీలు నడిచేవి. ఈ సారి సగానికి పైగా మార్కెట్‌ పడిపోయిందంటే జిల్లాలో మామిడి దిగుబడులు ఏ విధంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో పంట బాగా వచ్చినప్పటికీ స్థానిక మా ర్కెట్లలో మాత్రం మామిడికి డిమాండ్‌ ఏర్పడింది.

మామిడికాయలకు డిమాండ్‌

జిల్లాలో పండించిన మామిడి పండ్లకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రతి ఏడాది ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు క్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కూడా రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లెకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కాయలను కొనుగోలు చేస్తుంటారు. ప్రధానంగా మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యాణ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వచ్చి స్థానికంగా లాడ్జీలు లేదా ప్రత్యేకంగా రూములు తీసుకుని మూడు నెలలపాటు ఇక్కడే ఉండేవారు. కానీ ఈసారి మామిడికి సంబంధించి కాపు పెద్దగా లేకపోవడంతో వ్యాపారులు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు. ప్రధానంగా రైల్వేకోడూరు మార్కెట్‌ కాయలతో ఈ సీజన్‌ అంతా వ్యాపారులతో కళకళలాడేది.

చిన్నమండెం మండలంలో సాగులో ఉన్న మామిడితోట

చెట్లపై కాయలేవీ!

జిల్లాలో మామిడి పంట సాగు:

37 వేల హెక్టార్లు

ప్రతి ఏడాది సాధారణ దిగుబడులు:

3 లక్షల మెట్రిక్‌ టన్నులు

జిల్లాలో ప్రతి ఏడాది మామిడి

లావాదేవీలు: రూ. 200 కోట్లు

ప్రస్తుత ఏడాది దిగుబడి శాతం: 10-20

మామిడి సీజన్‌: ఏప్రిల్‌–జూన్‌

నెలాఖరు వరకు

జిల్లా మామిడి పంటకు ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా లాల్‌ బహార్‌, బేనీషా, ఖాదర్‌, తోతాపురి, బెంగులూర, ఇమామ్‌ పసంద్‌, చెరుకు రసం, మల్లిక, సువర్ణ రేఖ, దసేరి, మల్గుబా తదితర రకాలు సాగు చేశారు. జిల్లాలో 37 వేల హెక్టార్లలో మామిడి పంట సాగులో ఉండగా, అందులో 25 వేల హెక్టార్లలో కా యలు కాసే చెట్లు ఉన్నాయి. ప్రతి ఏడాది 3 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా దిగుబడి వచ్చేది. ఈసారి దిగుబడి 50–60 వేల మెట్రిక్‌ టన్నుల్లోపే వస్తుందని లెక్కలు వేస్తున్నారు. గతంలో ఎకరాకు పెద్ద చె ట్లకు సంబంధించి ఐదారు టన్నుల దిగుబడులు వ స్తుండగా, ప్రస్తుతం 1–2 టన్నులకే పరిమితమైంది.

తోటలోని మామిడి చెట్ల వద్ద నిలబడిన రైతు పేరు బండి నాగేశ్వర. ఈయనది మండల కేంద్రమైన సుండుపల్లె. ఈయనకు 3.24 ఎకరాల పొలం ఉంది. ప్రస్తుతం మామిడి తోటలో 14 ఏళ్ల వయస్సున్న ఇమామ్‌ పసంద్‌, నీలం, బెంగళూర, బేనీషా రకం చెట్లు ఉన్నాయి. ప్రతి ఏడాది 10–12 టన్నుల దిగుబడి వస్తుండగా, ప్రస్తుతం కేవలం 1–2 టన్నులకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. సకాలంలో పేడ, రసాయనిక ఎరువులు అందించినా దిగుబడి మాత్రం పెద్దగా లేదు. చెట్లు మాత్రం లేత ఇగుర్లతో కళకళలాడుతున్నా పూత, పిందె లేక దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని దిగాలు పడ్డాడు.

●భారీగా తగ్గిన దిగుబడులు
1/2

●భారీగా తగ్గిన దిగుబడులు

●భారీగా తగ్గిన దిగుబడులు
2/2

●భారీగా తగ్గిన దిగుబడులు

Advertisement
 
Advertisement
 
Advertisement