ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్!

Repos Energy Founders And Net Worth Details - Sakshi

ఆధునిక కాలంలో ఫుడ్, కూరగాయలు వంటి వస్తువులను డోర్ డెలివరీ పొందుతున్నారు. వీటి కోసం ప్రస్తుతం అనేక సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఫ్యూయెల్ (పెట్రోల్ అండ్ డీజిల్) కూడా డోర్ డెలివరీ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిజానికి ప్రస్తుతం దేశంలో స్టార్టప్ కల్చర్ పెరిగిపోతోంది. కొత్త ఆలోచనలతో సరికొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. స్విగ్గి, జొమాటో తరహాలోనే వాహన వినియోగదారులకు అవసరమైన పెట్రోల్ డోర్ డెలివరీ చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఒక భార్యాభర్తల జంట (చేతన్ వాలుంజ్ & అదితి భోసలే) రెపోస్ ఎనర్జీ (Repos Energy) ప్రారంభించారు.

రెపోస్ ఎనర్జీ
పెళ్లి తరువాత ఎలాగైనా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనతో అదితి, చేతన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అనుకున్నట్లుగానే సంస్థను పూణేలో ప్రారంభించారు. ప్రస్తుతం ఇది భారతదేశం మొత్తం మీదే సుమారు 65 నగరాల్లో విస్తరించి ఉంది. డోర్ టు డోర్ పెట్రోల్ డెలివరీ చేసి బాగా ఆర్జిస్తున్నారు.

రెపోస్ ఎనర్జీ ద్వారా వినియోగదారులకు, కంపెనీలకు పెట్రోల్ సరఫరా చేసి నెలకు రూ. 2.2 కోట్లు వరకు సంపాదిస్తున్నారు. ప్రారంభంలో వీరి ఆదాయం నెలకు రూ. 70,000 మాత్రమే. ఈ జంట చేస్తున్న బిజినెస్ చాలామంది పెద్ద పారిశ్రామిక వేత్తలను కూడా ఆకర్శించింది.

వీరి కొత్త ఆలోచనకు ముగ్దుడైన రతన్ టాటా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడు. దీంతో వారి బిజినెస్ మరింత వేగంగా ముందుకు వెళ్లడం ప్రారంభించింది. గతేడాది వీరి ఆదాయం రూ. 65 కోట్లకు చేరింది. ప్రస్తుతం కంపెనీ విలువ రూ. 200 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి..

రెపోస్ ఎనర్జీ ప్రస్తుతం టాటా గ్రూప్‌తో మాత్రమే కాకుండా.. మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ ఎలక్ట్రికల్, లార్సెన్ & టబ్రో, షిండ్లర్, జేడబ్ల్యు మారియట్ హోటల్, ఫీనిక్స్ మాల్, ది వెస్టిన్ హోటల్ వంటి సంస్థలతో కూడా ఒప్పందాలను కుదుర్చుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి.. మరింత లాభాలు పొందటానికి సంస్థ సన్నద్ధమవుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top