చంద్రబాబుకు సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

CM YS Jagan Nuzvid Tour Live Updates - Sakshi

Live Updates..

►నూజివీడులో అర్హులకు పట్టాలు ప్రదానం చేసిన సీఎం జగన్‌.

సీఎం జగన్‌ మాట్లాడుతూ..
►ప్రజలకు మంచి చేసి చంద్రబాబు సీఎం కాలేదు. చంద్రబాబుకు మంచి చేద్దామనే ఆలోచనే లేదు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీనే. బాబు హయాంలో అందరినీ మోసం చేశాడు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అబద్దాలతో వస్తారు.. ప్రతీఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. 

►తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్‌ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తుకు తెచ్చుకోండి. 

►ఎస్సీల్లో ఎవరైనా పుట్టానుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు అన్నారు. ఆయన అన్న మాటలను గుర్తుకుతెచ్చుకోండి. 

►ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్‌మెంట్‌లోని నాయకుడు చంద్రబాబు.  కోడలు మగ పిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా అన్నది చంద్రబాబే. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతీ ఇంటికి బెంజ్‌ కారు ఇస్తామంటారు మోసపోకండి. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ తోడేళ్లు అందరూ ఏకమవుతారు. ప్రజల దీవెనలు ఉన్నంత వరకూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోను.

►రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం. 2003 నాటి అసైన్డ్‌ భూములకు హక్కు కల్పిస్తున్నాం. కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నాం. పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదు. పేదవర్గాల పట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాం. 

►మొదటి దశలో 18లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తి అయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్‌డేట్‌. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నాం. అసైన్డ్‌ భూములకు భూ హక్కులు కల్పిస్తున్నాం. చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించాం. 

►ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం. లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్‌ సర్వీస్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాం. దళిత వర్గాల కోసం రాష్ట్రవ్యాప్తంగా స్మశాసవాటికలకు స్థలాలు కేటాయించాం. 

►నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే.. నేడు చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి రెండు సీట్లు వచ్చాయి. 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదు. 175కు 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ కచ్చితంగా గెలుస్తుంది. నారా లోకేశ్‌ రాజకీయాలకు పనికిరాడు.. ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి. లోకేశ్‌ ఏదైనా ఇండస్ట్రీ ప్రారంభిస్తానంటే సీఎం జగన్‌కు చెప్పి అనుమతులు ఇప్పిస్తాను. 

►ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘతన సీఎం జగన్‌దే. దివంగత వైఎస్సార్‌ వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు ఎవ్వరికీ పట్టాలు ఇవ్వలేదు. నూజివీడుకు చంద్రబాబు చేసిందేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రెండు సీట్లు కూడా రావు. 

►నూజివీడు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

►నూజివీడు బయలుదేరిన సీఎం జగన్‌

►కాసేపట్లో‌ అసైన్డు, లంక భూముల రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం

►భారీ భూ పంపిణీ కార్యక్రమానికి నేడు నూజివీడు వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిని శాశ్వత హక్కుతో అందించనున్నారు. 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటి­కలకు 33.32 ఎకరాలను ఇదే వేదిక నుంచి మంజూరు చేయనున్నారు. 

సీఎం పర్యటన ఇలా..
► ఉదయం 10.25 గంటలకు నూజివీడులోని హెలీప్యాడ్‌కు చేరుకుని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో మాట్లాడతారు. 
► 10.55 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. 
► 11.10 నుంచి 12.25 గంటల వరకు భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పట్టాలు పంపిణీ చేసి సభలో ప్రసంగిస్తారు. 
► 12.50 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుని స్థానిక నాయకులు, ప్రజలను కలుసుకుంటారు. అనంతరం 1.55 గంటలకు తాడేపల్లి పయనం కానున్నారు.   

గోడు విన్నారు.. పోడు భూములిచ్చారు 
సాక్షి, అమరావతి: గిరిజనుల గోడును ఆలకించి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోడు భూములకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం(ఆర్వోఎఫ్‌ఆర్‌ యాక్ట్‌) ద్వారా పట్టాలిచ్చి రికార్డు సృష్టించారు. గిరిజనులకు పోడు భూముల పంపిణీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా నిలిపారు. 2008 నుంచి 2019 వరకు గత ప్రభుత్వాలు 95,649 గిరిజన కుటుంబాలకు 2,33,410 ఎకరాలకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలిచ్చాయి. వీటిల్లో గత పదకొండేళ్లలో ఇచ్చిన మొత్తం పట్టాల్లో అ­త్యదికంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పంపిణీ చేసినవే కావడం గమనార్హం.

వాస్తవానికి పోడు భూములకు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్సారే. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత నాలుగున్నరేళ్లలో ఏకంగా మొత్తం 1,30,368 కుటుంబాలకు 2,87,710 ఎకరాలకు పట్టాలిచ్చి పేదలకు మేలు చేయడంలో తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని నిరూ­పించుకున్నారు. వీటిలో 1,29,842 మందికి 2,19,763 ఎకరాలు, 526 సామూహిక(కమ్యూనిటీ) టైటిల్స్‌ ద్వారా 67,947 ఎకరాల పోడు భూములకు పట్టాలుగా పంపిణీ చేయడం విశేషం.  

డీకేటీ పట్టాల పంపిణీ.. 
గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని (రిజర్వ్‌ ఫారెస్ట్‌ కాని భూమి) వారు సాగు చేసుకొని జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం డీకేటీ పట్టాల రూపంలో పంపిణీ చేస్తుంది. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఈ కార్యక్రమం ద్వారా 26,287 మంది గిరిజనులకు 39,272 ఎకరాల భూమిని పంపిణీ చేయడం గమనార్హం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top