భారతీయ ఐటీకి భారీ షాక్‌

కొత్త ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను చూపుతున్న ట్రంప్ - Sakshi


- హెచ్‌1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన అగ్రరాజ్యం

- తాజా ఈవోపై సంతకం చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌

- అమెరికన్లకే ఇక పెద్దపీట.. వృత్తినిపుణుల ఆశలపై నీళ్లు




వాషింగ్టన్‌:
అమెరికన్లకే పెద్దపీట అనే నినాదంతో అధ్యక్ష  పదవిని చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌...భారతీయ ఐటీ రంగంతోపాటు వృత్తినిపుణులకు షాక్‌ ఇచ్చారు. హెచ్‌1బీ నిబంధనలను కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన తాజా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌(ఈవో)పై సంతకం చేశారు. ‘బై అమెరికన్, హైర్‌ అమెరికన్‌’ అనే నినాదంతో ఈ వీసా విధానంలో సమూల మార్పులకు ఉద్దేశించిన తాజా ఈవోపై విస్కాన్సిన్‌లోని కెనోషా నగరంలోగల స్నాప్‌ ఆన్‌ ఇన్‌కార్పొరేషన్‌ కార్యాలయంలో మంగళవారం సంతకం చేశారు.



అంతకముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్‌ విధానం తీవ్రస్థాయిలో దుర్వినియోగమవుతోంది. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాల్లో విదేశీయుల ను నియమిస్తున్నారు. తక్కువ వేతనం చెల్లిస్తున్నారు. తాజా ఈవోతో ఈ దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది’ అని అన్నారు. దీంతో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సంస్కరణల అమలులోకి వస్తాయని, వీసా దుర్వినియోగానికి తెరపడుతుందని చెప్పా రు. లాటరీ విధానంలో ఈ వీసాలను ప్రసు ్తతం జారీ చేస్తున్నారని, అది తప్పని అన్నా రు. ఇందుకు బదులు వాటిని అత్యంత ప్రతి భావంతులకు, భారీవేతనాలు తీసుకుంటున్నవారికి మాత్రమే విధిగా కేటాయించాలన్నారు. అమెరికన్లను తప్పించడం కోసం వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ వీటిని వినియోగించకూడదన్నారు.



మా ఉద్యోగాలు మాకే

తమ దేశంలోని ఉద్యోగాలు తమవారికి మాత్రమే దక్కేలా చేయాలనే లక్ష్యంతోనే ‘హైర్‌ అమెరికన్‌’ నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతున్నామని ట్రంప్‌ చెప్పారు. ‘ఉద్యోగ నియామకాల్లో అమెరికన్లకే ప్రాధాన్యమివ్వాలని, అదే సమంజసమని అన్నారు. కాగా ట్రంప్‌ సంతకం చేసిన ఈవో ప్రకారం అమెరికా ప్రాజెక్టులను దేశీ య ఉత్పత్తులతోనే నిర్మించాల్సి ఉంటుం ది. ‘మా దేశంలోని కార్మికులు, ఉత్పత్తిదారులను మోసగించేందుకు విదేశాలు చేసే కుటిలయత్నాలను అంగీకరించబోం. ‘బై అమెరికన్‌’ విధానం కచ్చితంగా అమలయ్యేలా చూస్తాం. ఇందుకు భిన్నంగా కుది రే ఒప్పందాలపై నిఘా పెడతాం’ అంటూ ట్రంప్‌ హెచ్చరించారు. ట్రంప్‌ సంతకం చేసిన తాజా ఈవో ప్రకారం హెచ్‌1బీ వీసాలు అత్యంత ప్రతిభావంతులు, వృత్తినిపుణులకు మాత్రమే దక్కేలా చేసేందుకు అవసరమైన సంస్కరణలను  సెక్రటరీ ఆఫ్‌ స్టేట్, అటార్నీ జనరల్, కార్మిక విభాగం సెక్రటరీ, హోంలాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీలు సూచించాల్సి ఉంటుంది.



అమెరికా అధికారులతో మాట్లాడతా

న్యూఢిల్లీ: అమెరికా పర్యటన సందర్భంగా హెచ్‌1బీ వీసా అంశాన్ని అక్కడి యంత్రాంగం దృష్టికి తీసుకెళతానని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం సూచనప్రాయంగా తెలియజేశారు. ‘ఐటీ రంగానికి సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించాల్సి ఉంటుంది. వారితో చర్చల అనంతరం ఏమిజరిగిందనేది మీకు తెలియజేస్తా. ’అని అన్నారు. ఇదిలాఉంచితే హెచ్‌1బీ వీసా మంజూరు విషయంలో నిబంధనలను కఠినతరం చేయడంపై భారతీయ ఐటీరంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top