ఓ ప్రకటన... జీవితాలను మార్చేసింది...

ఓ ప్రకటన... జీవితాలను మార్చేసింది...


ఒకప్పుడు ఆ గ్రామం గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు అదో పర్యటక కేంద్రంగా మారిపోయింది. అక్కడి ప్రజల కుల వృత్తులు, కళలు ప్రపంచానికి పరిచయమయ్యాయి. లగ్జరీ లైఫ్ ను... లక్షల జీతాన్ని వదులుకున్న  యువ ఇంజనీర్   సౌరభ్ పాట్ దార్ ఆశయం గ్రామంలో అనూహ్య మార్పును తెచ్చింది.



అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ముంబై కి దగ్గరలోని  తానే జిల్లా జవహర్ గ్రామం గురించి ఇప్పుడు ఆ చుట్టుపక్కల  తెలియనివారుండరు. సౌరభ్ లక్ష్యం సాధించేందుకు ఎంతో కష్టపడ్డాడు. గ్రామాల్లో ప్రజలకు ముందుగా తాను అవగాహన కల్పించాడు. రూరల్ టూరిజం ను ప్రవేశపెట్టి తన ప్రాజెక్టును ప్రారంభించాడు. పల్లె ప్రజల కళ్ళల్లో కాంతులు చూడాలనుకున్న సౌరభ్... BAIF సహాయంతో జవహర్ గ్రామాన్ని పర్యటక కేంద్రంగా మార్చేందుకు తీవ్ర కృషి చేశాడు. దోరాబ్జీ టాటా ట్రస్ట్ సహాయంతో గ్రామాల్లోని వస్తువులు అక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకునేలా చేశాడు.  జవహర్ గ్రామం గురించి దగ్గర్లోని అన్ని స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళి ప్రచారం చేశాడు. గ్రామంలోని ప్రాధాన్యతలను వివరించాడు.



అయితే సౌరభ్ గ్రామంలో కొనుగోలుదారులను ఆకట్టుకునే సరైన వస్తువులు లేవని, అమ్మకాలు చేపట్టేందుకు అక్కడి ప్రాధమిక సదుపాయాలు సరిపోవని తెలుసుకున్నాడు. గ్రామాభివృద్ధికి టూరిజం వారు ఇచ్చిన డబ్బును క్రమ పద్ధతిలో ఖర్చుపెట్టి, విలేజ్ టూరిజం ను అభివృద్ధి చేసేందుకు స్థానికులను ఒప్పించాడు. పలు సంస్థల్లో భాగస్వామ్యం పొంది, పర్యటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాడు. పర్యటనకు వచ్చినవవారికి కావలసిన వసతులను, బస చేసేందుకు వీలైన సౌకర్యాలను  గ్రామంలో ఏర్పాటు చేశాడు. ట్రైబల్ డాన్స్, ఆటలు, పాటలు వంటి వివిధ కార్యక్రమాలతో అధిక సంఖ్యలో పర్యటకులు గ్రామాన్ని సందర్శించేలా చేశాడు.  



తాను అనుకున్నది సాధించేందుకు సౌరభ్ మరో ప్రయత్నం కూడ చేశాడు. తన స్నేహితునితో కలసి దగ్గరలోని గ్రామాల్లో వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవారిని, కళాకారులను కలిశాడు. ఎంతో కష్టపడి వారు తయారు చేసే అందులో భాగంగా వర్లి పెయింటింగ్స్ వేసే సదానంద్ నాకర్ ను కలిశాడు.  మూగ, చెవిటి వాడైన సాకర్  కుటుంబమంతా తొమ్మిది నుంచి పద్ధెనిమిది గంటల పాటు కష్టపడితే ఓ పెయింటింగ్ తయారవుతుంది. అది అమ్మితే వారికి 75 రూపాయలు వస్తుంది. దాంతో వారి కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. అది చూసిన సౌరభ్... నాకర్ కు సహాయపడేందుకు నిశ్చయించుకున్నాడు. తన ప్రాజెక్ట్ లో భాగంగా ఆ కళాకారుడిని ప్రోత్సహించి అతని జీవితాన్ని మెరుగు పరచాలనే ఉద్దేశ్యంతో అతడి పెయింటింగ్స్ ను మార్కెట్ చేసేందుకు స్థిద్ధపడ్డాడు.  


ముంబైకి తీసుకెళ్ళి అమ్మకాలు ప్రారంభించాడు. వర్లి పెయింటింగ్స్ కు అత్యంత ఆదరణ లభించడంతో సౌరభ్ సదానంద్ కు తన క్లైంట్లను పరిచయం చేశాడు. ప్రస్తుతం సదానంద్ పెయింటింగ్స్ కు మార్కెట్లో అత్యంత ఆదరణ లభించడంతో ఒక్కో పెయింటింగ్ సుమారు లక్ష రూపాయల వరకూ పలుకుతోంది. అంతేకాదు తన మార్కెట్  జర్మనీకి కూడ విస్తరించాడు. ప్రస్తుతం వర్లి పెయింటింగ్ బిజినెస్ కు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణ లభిస్తోంది.



సౌరభ్ ఆశయం నెరవేరింది. తన ప్రాజెక్టు పూర్తవ్వడంతో పాటు... సదానంద్ జీవితంలో పెను మార్పు రావడం ఆనందం కలిగించింది. అయితే లక్షల జీతంతో ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నసౌరభ్ తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు పేపర్లో వచ్చిన 'ఎస్ బీ ఐ యూత్ ఫర్ ఇండియా'  ప్రకటన ఎంతగానో సహాయ పడింది. ఎస్ బీ ఐ ఫెలోషిప్ ను వినియోగించుకొన్న సౌరభ్.. వర్లి పెయింటింగ్ ప్రాజెక్టుకు ఎస్ బీ ఐ నుంచి అధికారికంగా అనుమతి కూడ లభించింది.  గ్రామాభివృద్ధికి పాటుపడ్డ సౌరభ్ ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకోవడంతో పాటు మరెందరో యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.





Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top