
28న పీఎస్‌ఎల్‌వీ సీ30 ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈనెల 28న ఉదయం 10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ30 ప్రయోగించనున్నారు.
26న ఉదయం 9 నుంచి కౌంట్‌డౌన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈనెల 28న ఉదయం 10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ30 ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహ వాహకనౌకద్వారా 1,513 కిలోలు బరువున్న ఆస్ట్రోశాట్‌తో సహా 7 ఉపగ్రహాలను ముందుగా నిర్ణయించిన సమయం మేరకే ప్రయోగించాలని మిషన్ సంసిద్ధతా కమిటీ (ఎంఆర్‌ఆర్) నిర్ణయించింది.
రాకెట్‌కు సంబంధించి అన్ని పరీక్షలు పూర్తిచేసి ఎంఆర్‌ఆర్ కమిటీ లాంచ్ ఆథరైజేషన్ బోర్డు కు ప్రయోగ బాధ్యతలను అప్పగించడంతో గురువారం సాయంత్రం లాంచ్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోసారి లాంచ్ రిహార్సల్ అనంతరం 25న ప్రీ కౌంట్‌డౌన్ నిర్వహించి 26న ఉదయం 9 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.