మలేషియా విమాన శకలాల గాలింపునకు అడ్డంకులు | Sakshi
Sakshi News home page

మలేషియా విమాన శకలాల గాలింపునకు అడ్డంకులు

Published Tue, Mar 25 2014 2:55 PM

విమానం కూలిపోయిందని తెలిసిన తరువాత విలపిస్తున్న ప్రయాణికుల బంధువు

కౌలాలంపూర్ : మలేషియా విమాన శకలాల గాలింపునకు వాతావరణం అనుకూలంగా లేదని మలేషియా ప్రభుత్వం తెలిపింది.  వాతావరణం ప్రతికూలంగా ఉండటం వల్ల పూర్తి సమాచారాన్ని తెలుసుకోలేకపోతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.  విమానం ఎక్కడ, ఎలా కూలిపోయిందీ ఈ రోజు సమాచారం ఇస్తామని  మలేషియా ప్రభుత్వం తెలిపింది.

తప్పిపోయిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 370 కూలిపోయిందని ఆ ప్రభుత్వం నిన్న నిర్ధారించిన విషయం తెలిసిందే.(వీడిన మలేషియా విమానం మిస్టరీ) కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన ఈ విమానం ఈ నెల 8న అదృశ్యమైంది.16 రోజుల తరువాత కూలిపోయినట్లు తెలిసింది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. విమానం కూలిపోయిన ప్రదేశానికి వెళ్లి, శకలాలను పరిశీలించి వివరాలు సేకరించడానికి వాతావరణం అనుకూలంగాలేదు. ఈ రోజు సాయంత్రానికి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement