అవకాశం కల్పించరూ...! | Sakshi
Sakshi News home page

అవకాశం కల్పించరూ...!

Published Sat, Jul 16 2016 1:56 AM

అవకాశం కల్పించరూ...! - Sakshi

అర్హత పరీక్షలకు గైర్హాజర్ అయిన ఎస్సై అభ్యర్థుల వేడుకోలు
కొంత మందికే అవకాశం  ఇవ్వడంపై అసంతృప్తి

 
 
వరంగల్ : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఎస్సై పోస్టుల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన ఎంపికల ప్రక్రియలో సాంకేతిక కారణాల వల్ల గైర్హాజర్ అయిన అభ్యర్థులు తమకు అవకాశం కల్పించాలని నగర కమిషనర్ జి.సుధీర్‌బాబు ను అభ్యర్థిస్తున్నారు. ఈనెల 4వ తేదీన జేఎన్‌ఎ స్ స్టేడియంలో ఎస్సై పోస్టుల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఆ రోజున నంబర్ల ప్రకారం పిలిచి ధ్రువీకరణ పత్రాలను పరిశీలి స్తారని భావించిన చివరి నంబర్లలో ఉన్న అభ్యర్థులు తమ పనులపై వెళ్లారు. అదే సమయంలో అభ్యర్థులను సీరియల్ నంబర్ల ప్రకారం పిలువకుండా అధికారులు జంబ్లింగ్ పద్ధతిలో పిలవడంతో పలువురు స్థానికంగా లేకపోవడం వల్ల గైర్హాజర్ అయ్యారు. పనులు ముగించుకొని వ చ్చిన వారికి ఈ విషయం తెలిసి షాక్‌కు గురయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి భర్తీ ప్రక్రియ కావడంతో పలువురు ఆశలు పెట్టుకున్నారు. ఇదే విషయాలను అక్కడి అధికారులకు తెలుపడంతో సీపీ దృష్టికి తీసుకుపోయారు. ఈ విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పడంతో వీరు ఆశతో ఇళ్లకు వెళ్లిపోయినట్లు గైర్హాజర్ అయిన అభ్యర్థులు తెలిపారు. రంజాన్ పండుగ ఉన్నందున ఆ రోజున పరీక్షల కు హాజరయ్యే ముస్లిం అభ్యర్థులకు మరో రోజు న ఎంపికలు నిర్వహిస్తామని చెప్పడంతో గైర్హాజ ర్ అయిన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.


రంజాన్ రోజున రాని వారికి 9వ తేదీన పరీక్షలు నిర్వహిస్తుండడంతో వీరు వెళ్లి నగర పోలీస్ క మిషనర్‌ను కలిసినట్లు తెలిపారు. కేవలం రం జాన్ రోజున గైర్హాజర్ అయిన వారికే అవకాశం ఇస్తున్నట్లు ఆయన చెప్పడంతో వీరు సీపీని ప్రా దేయపడ్డినట్లు తెలిసింది. రూరల్ పరిధిలో ఇ లాంటి సమస్యలతో గైర్హాజర్ అయిన వారికి రూరల్ ఎస్పీ అవకాశం కల్పించినట్లు సమాచా రం. అయినప్పటికి సీపీ కుదరదని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగినట్లు అభ్యర్థులు వాపోతున్నారు. ఇదే విషయంపై పోలీసు రిక్రూట్‌మెంట్ చైర్మన్‌ను జంబ్లింగ్‌తో గైర్హాజర్ అయిన అభ్యర్థులు కలిసి ప్రాధేయపడగా ఎంపిక ప్రక్రియ జిల్లా స్థాయిలోనే జరుగుతున్నందున వారే ని ర్ణయం తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. దీంతో మరోసారి సీపీని కలిసి అభ్యర్థులు విన్నవించినా ఆయన సమ్మతించలేదని తెలిసింది. ఈ పరీక్షల్లో కానిస్టేబుళ్లగా పనిచేస్తున్న కొంత మంది అభ్యర్థులు ఇదే కారణాలతో హాజరుకాలేకపోయినట్లు తెలిసింది.గైర్హాజరైన అభ్యర్థులు తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు.
 
 

 
Advertisement
 
Advertisement