అన్నం పెట్టే రైతుకు కూడు లేదు

అన్నం పెట్టే రైతుకు కూడు లేదు - Sakshi


దేశ ప్రజలందరికీ అన్నంపెట్టే రైతుకు కూడు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హన్మకొండలోని నందనా గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు.

- వ్యవస్థను కూల్చే ప్రయత్నాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

- కార్పొరేట్ సంస్థలకు తలొగ్గిన పాలకులు

- మేలుకోక పోతే చరిత్ర క్షమించదు

- రౌండ్ టేబుల్ సదస్సులో వక్తలు

వరంగల్:
దేశంలోని ప్రజలందరికి అన్నం పెట్టే రైతుకు కూ డు దొరకని పరిస్థితులు నెలకొన్నందున ఆత్మహత్య కొనసాగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండలోని నందనా గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన మా ట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో జిల్లాలోని రైతులు, విషయనిపుణులు, ఇతరుల సందేశాలను వచ్చిన రైతాంగానికి విశదీకరించారు.



ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వచ్చినందున కష్టాలు తీరుతాయ న్న భావించిన రైతులు మరిన్ని ఇబ్బందులకు గురువుతన్నారని అన్నారు. రుణ మాఫీ ఒకే సారి చేయక పోవడం...రెన్యూవల్ చేసుకుంటేనే 25 శాతం మాఫీ చేస్తామ ని అనడంతో రైతులకు అప్పులు పుట్టని పరిస్థితులు నెల కొన్నాయన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు 1300 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులకు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునే సమయం లేకుండా పోయిందా? అని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చినంక ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడం వ్యవ స్థను కూల్చడమే అన్నారు.

 

సీఎంగా రాజకీయాలు చేయొద్దు..

ప్రజల ఓట్ల కోసం రాజకీయాలు చేసి గద్దెనెక్కిన ఏ ముఖ్యమంత్రి ఆయినా రాజకీయాలు చేయడం మానుకోవాలని రైతు ఐక్య సంఘటన కమిటీ అధ్యక్షుడు, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రజా పాలనలో అందరిని ఒకే కోణం చూడాల్సిన సీఎం ఇతర రాజకీయ పార్టీల నేతలను లోబర్చుకోవడం సరికాదన్నారు.  పినతల్లి కొట్టిందని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్‌కు రైతుల పిల్లలు కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఇన్‌పుట్స్ ధరలు పెరిగినా పంటలకు గిట్టుబాటు ధరలు అందించనందునే ఆత్మహత్యలు పునరావృతం అవుతున్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లో సుమారు రెండు వేల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రభుత్వాలు నమ్మక పోవడం అంత్యంత దారుణమన్నారు.



ఇక్కడి ైరె తులను చంపి ఇతర దేశాల నుంచి నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకుంటే కార్పొరేట్ సంస్థలే గుత్తాధిపత్యం చెలాయిస్తాయన్నారు. సమావేశంలో కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయినిరాజేందర్‌రెడ్డి, ఎంపీలు ఏకే .ఖాన్, హనుమంతరావు, ఆనందభాస్కర్, ఎమ్మెల్యే దొంతి మాధవెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రులు పోన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌రాబు, షబ్బిర్‌అలీ, బస్వరాజు సారయ్య, మాజీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, కొండేటి శ్రీధర్,  రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, సాంబారి సమ్మారావు, బండా ప్రకాశ్, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఆరోగ్యం, వరద రాజేశ్వర్‌రావు, నమిండ్ల శ్రీనివాస్, బిన్నీ లక్ష్మన్, శ్యాం, బట్టి శ్రీను, పోశాల పద్మ, మీడియా ఇన్‌చార్జి ఈవీ.శ్రీనివాసరావు, వెంకటస్వామి, వీసం సురేందర్‌రెడ్డి, విషయ నిఫుణులు నర్సింహరెడ్డి, జలపతిరావు, జానయ్య, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు.

 

తీర్మానాలు...

తెలంగాణ కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ సదస్సులో తీర్మానించిన అంశాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

- ఆత్మహత్యల నివారణకు కమిటీ వేసి చర్యలు తీసుకోవాలి.

- ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

- రుణ మాఫీని దఫాలుగా కాకుండా ఒకేసారి రుణ మాఫీ అమలు చేయాలి

- పంటల బీమా పథకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరిని తెలపాలి.

- అకాల వర్షాలు..పంటలు నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్ట పరిహారం చెల్లించాలి.

- చెరుకు పండించే రైతులకు బకాయిలు చెల్లించాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top