పోలీస్ (మిస్) ఫైర్..!

పోలీస్ (మిస్) ఫైర్..!


ఎస్సై చేతిలోని రివాల్వర్ మిస్‌ఫైర్ అయింది. పట్టణంలోని లాడ్జిలో స్నేహితులతో కలిసి విందు చేసుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో లాడ్జిలో పనిచేస్తున్న సర్వర్‌బాయ్ కాలికి స్వల్ప గాయమైంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి.

 

చర్యలు తీసుకుంటాం.. - ఎస్పీ

పట్టణంలోని మయూరి ఇన్ లాడ్జిలో జరిగిన రివాల్వర్ మిస్‌ఫైర్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గజరావు భూపాల్ పేర్కొన్నారు. ఎస్పీ సోమవారం రాత్రి నిర్మల్‌లోని మయూరి ఇన్ లాడ్జిలో సంఘటన జరిగిన గదిని పరిశీలించారు. అనంతరం ఆయన డీఎస్పీ మాధవరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. లా డ్జిలో రెండు రౌండ్ల కాల్పులు జరిగిన మాట వాస్తవమేనన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలుతీసుకుంటామని పేర్కొన్నారు.

 

నిర్మల్ అర్బన్ :  కరీంనగర్ జిల్లా రా యికల్ ఎస్సై రాములు నాయక్ ఆది వారం నిర్మల్‌కు వచ్చారు. అనంతరం తన స్నేహితులైన నిర్మల్ డివిజన్‌కు చెందిన కొందరు ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, ఎంఈవోలతో కలిసి కుంటాల జలపాతానికి విహార యాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపారు. అక్కడి నుంచి రాత్రి నిర్మల్‌లోని మ యూరి ఇన్ లాడ్జి లో 212 నంబర్ గదిలో దిగా రు.రాత్రి స్నేహి తులతో కలిసి విం దు చేసుకున్నారు.



సుమారు 11గంటల సమయంలో రివాల్వర్ కిందపడి పేలింది. ఈ ఘటనలో మద్యం సీసాలు పగిలినట్లు సమాచారం. అదే సమయంలో గదిలోకి సర్వర్ బాయ్ బాలు వచ్చాడని, బుల్లెట్‌తో దెబ్బతిన్న గచ్చు బాలు కాలికి గుచ్చుకొని స్వల్ప గాయమైందని పోలీసులు తెలిపారు. కాగా, రాయికల్ ఎస్సైరాములు నాయక్ ఉన్న గది.. నిర్మల్ డివిజన్‌లోని ఓ మండల ఎంపీడీవో పేరిట బుక్ చేసినట్లు లాడ్జి రికార్డుల్లో ఉంది. ఆదివారం మధ్యాహ్నమే ఈ గది బుకింగ్ చేసినట్లు రికార్డుల ఆధారంగా తెలుస్తోంది.



పోలీసుల విచారణ

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. సోమవారం సాయంత్రం డీ ఎస్పీ మాధవ్‌రెడ్డి లాడ్జిలోని 212 గదిలోకి వెళ్లారు. బుల్లెట్‌తో దెబ్బతిన్న నేల, గదిని పరిశీలించారు. లాడ్జి నిర్వాహకులు, అక్కడ పనిచేసే సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఎస్సై రివాల్వర్ కిందపడడంతోనే మిస్‌ఫైర్ అయి ఉంటుం దని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ వెంట రూరల్ సీఐ రఘు, పట్టణ ఎస్సై రాంనర్సింహారెడ్డి ఉన్నారు.



ఘటనపై అనుమానాలు..

గదిలో ఉన్న ఇద్దరి మధ్య గొడవ జరగడంతోనే ఫైర్ జరిగి ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా రు. గదిలో సుమారు ఐదుగురు ఉన్న ట్లు సమాచారం. అంతేకాకుండా సర్వ ర్ బాయ్‌పై ఆగ్రహంతో ఫైర్ చేసి ఉం టారనే అనుమానాలూ వినిపిస్తున్నా యి. అయితే ఎందుకు ఎస్సై రివాల్వర్ నుంచి రెండు బుల్లెట్లు బయటకు వ చ్చాయనే సంగతి ఇంకా తేలాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top