రెండు మృతదేహాలకు రీపోస్టుమార్టం


కీసర: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువకుల మృతదేహాలకు రీపోస్టుమార్టం చేశారు. వివరాలిలా ఉ న్నాయి. కీసర మండల రెవెన్యూ పరిధిలోని కాప్రా ప్రాంతం సాయిరాంనగర్ కాలనీకి చెందిన సాయికుమార్(21), ప్రసాద్(19), రమేష్,  బాలశెట్టి, శ్రీకాంత్ ఈనెల 2వతేదీన ఉదయం సరదాకోసం మండలంలోని కుందన్‌పల్లి గ్రా మ సమీపంలోగల తాటివనంలోకి వచ్చి అందరూ కళ్లు తాగారు. చెక్ డ్యాంలో ఈత కొట్టేందుకు సాయికుమార్, ప్రసా ద్ దిగి గల్లంతైన విషయం తెలిసిందే.

 

  దీంతో మిగతా ముగ్గురు మిత్రులే తమ కుమారులను కొట్టిచంపి చెక్‌డ్యాంలో పడేశారని మృతుల కుటుం బ సభ్యులు (సాయికుమార్ తండ్రి సత్తిబాబు, ప్రసా ద్ తండ్రి సత్యనారాయణ) గతంలో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కీసర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈనెల 4వ తేదీన యువకుల మృతదేహాలను కాప్రా సాయినగర్‌లోని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు.

 

 కాగా పోస్టుమార్టం నివేదిక అనుమానాస్పదంగా ఉందని, తమ కుమారులది హత్యేనని, మృతదేహాలకు మరోసారి రీపోస్టుమార్టం  నిర్వహించాలని మృతుల కుటుం బసభ్యులు పోలీసు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో మంగళవారం గాంధీ ఆస్పత్రి వైద్యుడు రమణమూర్తి  ఆధ్వర్యంలో వైద్య బృందం, కీసర త హసీల్దార్ రవీందర్‌రెడ్డి, కీసర సీఐ గురువారెడ్డి సమక్షంలో కాప్రా సాయినగర్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన సాయికుమార్, ప్రసాద్ మృతదేహాలను వెలికితీసి మరోసారి రీపోస్టుమార్టం నిర్వహించారు.సేకరించిన  కొన్ని శరీరబాగాలను ల్యాబ్‌కు పంపించి నివేదిక అందజేస్తామని డాక్టర్లు తెలిపారు.

 

 7

 వడదెబ్బ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

 యాచారం: కేంద్ర ప్రభుత్వం సవరించిన జీఓ-1 ప్రకారం వడదెబ్బతో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని కాంగ్రె స్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముది రెడ్డి కోదండరెడ్డి డిమాండ్ చేశారు. యాచారంలోని తన నివాసంలో మం గళవారం విలేకరులతో మాట్లాడుతూ ఎండ తీవ్రతవల్ల రాష్ట్రంలో పలు జిల్లాల్లో నిత్యం ఎంతోమంది మృతి చెందుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయన్నారు.

 

 వడదెబ్బకు రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో పంటల రుణాల మాఫీ కింద 37,077,651 రైతులను గుర్తించి, రూ.17,043,053 కోట్ల మాఫీ చేస్తున్న ట్లు ప్రభుత్వం ప్రకటించిందని, కానీ నేటికి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు రుణాలను తిరగ రాసి రైతులను మరింత అప్పు ల్లో మునిగేలా చేస్తున్నాయన్నారు. ప్ర భుత్వం వెంటనే రుణమాఫీ అమలు చేసి రైతులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి న టైటిల్ డీడ్లను అందజేయాలని డి మాండ్ చేశారు.

 

 అకాల వర్షాలతో పం ట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. తక్షణ మే పరిహారం అందజేస్తే వచ్చే ఖరీఫ్ సీజన్‌లో రైతులకు పెట్టుబడులకు అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. రైంతాంగ సమస్యలపై ప్రభుత్వంపై రాజీలేని పోరాటాలు తప్పవన్నారు. సమావేశంలో యాచారం మండల కి సాన్ సెల్ అధ్యక్షుడు మల్లేష్, ప్రధాన కార్యదర్శి పాండురంగారెడ్డి ఉన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top