నారా లోకేశ్ పై కేసు నమోదు చేయండి: కోర్టు | court ask lb nagar police file case on nara lokesh | Sakshi
Sakshi News home page

నారా లోకేశ్ పై కేసు నమోదు చేయండి: కోర్టు

Nov 18 2014 5:33 PM | Updated on Aug 29 2018 3:37 PM

నారా లోకేశ్(ఫైల్) - Sakshi

నారా లోకేశ్(ఫైల్)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ పై కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులను రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ పై కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులను రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం ఆదేశించింది. న్యాయవాది రవికుమార్ ఫిర్యాదు మేరకు న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు నడిపిస్తున్నారని, శాంతిభద్రతలు అదుపుతప్పి పోయాయని, హిట్లర్ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ట్విటర్ లో లోకేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన లోకేశ్ పై బంజారాహిల్స్, ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. (కేసీఆర్ హిట్లర్లా పాలిస్తున్నారు: లోకేష్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement